దుబాయ్‌కెళ్లిన భర్త..పక్కింటి కుర్రాడితో భార్య, చివరికి బూడిదగా

sivanagaprasad kodati |  
Published : Jan 20, 2019, 11:59 AM IST
దుబాయ్‌కెళ్లిన భర్త..పక్కింటి కుర్రాడితో భార్య, చివరికి బూడిదగా

సారాంశం

వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడి చేతిలో వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన అన్నెపు కుసుమన్న, లక్ష్మీలకు 15 ఏళ్ల క్రితం వివాహామైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కుసుమన్న డబ్బు సంపాదించడానికి కొద్దినెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో లక్ష్మీకి అదే గ్రామానికి చెందిన భాస్కరరావు అనే యువకుడితో పరిచయం ఏర్పడి, ఇది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది.

భర్త విదేశాల్లో ఉండటం, అడ్డు చెప్పేవారు లేకపోవడం వారిద్దరూ లక్ష్మీ ఇంట్లోనే ఏకాంతంగా గడిపేవారు. ఈ నేపథ్యంలో భాస్కరరావుకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇది గమనించిన లక్ష్మీ తో అతనికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలో భాస్కరరావు..వివాహితను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9వ తేదీ తన సోదరి కనిపించడం లేదంటూ లక్ష్మీ సోదరుడు చింతాడ అప్పన్న 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో భాస్కరరావుపై అనుమానం వ్యక్తం చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. లక్ష్మీని చంపి లింగాలవలస సమీపంలోని కొండల్లో మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్లు తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu