మల్కాపురంలో దూకుడు పెంచిన సీఐడీ అధికారులు (వీడియో)

Published : Mar 27, 2021, 02:30 PM IST
మల్కాపురంలో దూకుడు పెంచిన సీఐడీ అధికారులు (వీడియో)

సారాంశం

రాజధాని అసైన్డ్ భూముల రైతుల విచారణలో సీఐడి అధికారులు  వేగం పెంచారు. మందడంలోని మల్కాపురం గ్రామంలో అసైన్డ్ భూముల రైతులను సీఐడి అధికారులు విచారిస్తున్నారు.

రాజధాని అసైన్డ్ భూముల రైతుల విచారణలో సీఐడి అధికారులు  వేగం పెంచారు. మందడంలోని మల్కాపురం గ్రామంలో అసైన్డ్ భూముల రైతులను సీఐడి అధికారులు విచారిస్తున్నారు.

"

సీఐడి అధికారులు ఐదు బృందాలతో కలిసి యాభై మంది రైతులను విచారిస్తున్నారు.  విచారణకు రైతులు న్యాయవాదులతో కలిసి వచ్చారు. న్యాయ వాదుల సమక్షంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. 

మల్కాపురం ఎసైన్డ్ రైతులను విచారించిన అధికారులు, రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. రాజధాని ప్రకటించాక గత ప్రభుత్వాన్ని భూములు తీసుకోమన్నామని, అయితే తీసుకోపోగా 2017,2 018 లో రికార్డులు మార్చారన్నారు.

మేము కోర్ట్ కు వెళ్తే తీర్పు తమకు అనుకూలం వచ్చిందన్నారు. తమ పెద్దలకు 1926 ఉదండ్రయునిపాలెం 98 ఎకరాలకు డీకే పట్టాలు ఇచ్చారని, గతప్రభుత్వం తమ రికార్డులు తారుమారు చేసి భూములు వేరేవాళ్లకు కట్టబెట్టి మాకు అన్యాయం చేయాలని చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమైనా తమకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!