మొత్తం నాలుగు కేసుల్లో ఆధారాలున్నాయి: చంద్రబాబు కేసులపై సజ్జల

By narsimha lodeFirst Published Sep 29, 2023, 2:00 PM IST
Highlights

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  మూడేళ్ల పాటు దర్యాప్తు చేసిన తర్వాతే  చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
 

అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.శుక్రవారంనాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అని సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారని చంద్రబాబుపై  సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు.దొంగతనం చేసి సానుభూతిని కోరుకుంటున్నారని ఆయన  చంద్రబాబు తీరుపై వ్యాఖ్యానించారు. మూడేళ్లు దర్యాప్తు చేసిన ఆధారాలు లభించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

లోకేష్ ఢిల్లీలో ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసిందన్నారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందన్నారు.

లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు అవుతారని ఆయన చెప్పారు.చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తాము ప్రచారం చేసే అసత్యాలను జనం నమ్మక చస్తారా అని  టీడీపీ భావిస్తుందన్నారు.

 దోపీడీ దొంగల ముఠా అడ్డంగా దొరికిపోయిందని ఆయన విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకుని చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్  ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీరంతా తోడు దొంగలే .... ఇంత కంటే పెద్ద పదం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. స్కామ్ లో ఆధారాలు దొరికాయని ప్రభుత్వం కోర్టు ముందు ఆధారాలుంచిందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. స్కాం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.ప్రజాధనం దోపీడీకి గురైందని దర్యాప్తు చేసిన సీఐడీ ఆధారాలు సమర్పించిందన్నారు.చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టు కదా అని గుర్తు చేశారు.

ఏపీ స్కిల్ స్కామ్ లో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థ ప్రకటనను సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఫైబర్ గ్రిడ్ లో కూడ చంద్రబాబు పాత్ర ఉందన్నారు.అమరావతిలో కూడ చంద్రబాబు పాత్ర ఉందన్నారు.చంద్రబాబుపై కక్షసాధింపు చేయాల్సిన అవసరం తమకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతికి వినతిపత్రమిచ్చారు, ఐక్యరాజ్యసమితికి వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని  ఆయన ఎద్దేవా చేశారు.

click me!