పాదయాత్రలోనే మీ కష్టాలను చూశా: వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల

By narsimha lode  |  First Published Sep 29, 2023, 12:59 PM IST


వాహన మిత్ర పథకం కింద ఐదో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడలో విడుదల చేశారు.


విజయవాడ: పాదయాత్ర సందర్భంగా వాహన డ్రైవర్ల కష్టాలు తెలుసుకొని  వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.వాహనమిత్ర పథకం కింద ఐదో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు విడుదల చేశారు.ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.   బతుకుబండి లాగడానికి ఇబ్బందిపడే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.అటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతీ ఏటా వాహనమిత్ర ద్వారా ఏడాదికి పదివేలు అందచేస్తున్నట్టు చెప్పారు.2,75,931 మందికి 275.93 కోట్లు బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఆటో, ట్యాక్సీలను నడుపుతున్న కుటుంబాలకు ఈ ఆర్ధిక సాయం చేదోడు వాదోడుగా  ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. మీ వాహనాలకు సంబంధించి ఇన్స్యూరెన్స్, వాహనాల పిట్ నెస్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోవాలని సీఎం డ్రైవర్లకు సూచించారు.వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారని మర్చిపోవద్దన్నారు.

also read:చంద్రబాబు‌కు అన్నీ అవినీతి మరకలే: మంచి జరిగితే మాకు అండగా నిలవాలన్న జగన్

Latest Videos

తమ ప్రభుత్వం  అందరి ప్రభుత్వంగా సీఎం జగన్ పేర్కొన్నారు.  ఇళ్లు లేని వారికి ఇళ్ల స్ధలాలిచ్చి నిర్మాణం చేపడుతున్నట్టుగా చెప్పారు. ఇళ్ల వద్దకే బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇంటి వద్దకే వచ్చి జల్లెడ పడుతున్నారన్నారు.మన ఊళ్లలోనే ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పిస్తున్నట్టుగా సీఎం గుర్తు చేశారు.  మీ వార్డు, గ్రామాలలో లంచాలు లేని వాలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలన్నీ మీ ఇంటి ముందుకే తెచ్చామని తెలిపారు.గ్రామ, వార్డు స్ధాయిల్లో మహిళ పోలీస్ ఏర్పాటు చేశామన్నారు. జగనన్న అరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు చేయిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.  ఎవరో ఉద్యమాలు చేస్తే అమలు చేయలేదన్నారు. తన పాదయాత్రలో సమస్యలు గుర్తించి అమలు చేస్తున్నానని ఆయన వివరించారు. 

click me!