టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తుంది జగన్ సర్కార్. ఆయనను ఇరకటంలో పడేసేలా మరో మూడు కేసులు నమోదుకు రంగం సిద్దం చేస్తోంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. జగన్ సర్కార్ ఇప్పటికే కేసులు పట్టిన విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై కేసు నమోదు చేసి.. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది. పలు సార్లు బెయిల్ కోసం అప్లై చేసిన తిరస్కరించబడింది. చివరికి అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి అలా బయటికి వచ్చాడో లేదో.. మరో కేసు బనాయించి చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తోంది. ఇప్పటికే.. మాజీ సిఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, మద్యం, ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు, అసైన్డ్ భూములకు సంబంధించి పలు ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ఇలా ఇప్పటికే చంద్రబాబుపై ఆరు కేసులు నమోదు చేయగా.. తాజా మరో మూడు కేసులను నమోదు చేయడానికి ఏపీ సీఐడీ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రధానంగా నీరు-చెట్టు, ఉపాధి హామీ స్కీం, కృష్ణా పుష్కర సమయంలో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగాయని టీపీడీ అధినేతపై కేసు నమోదు చేసేందుకు ఏపీ సీఐడీ కసరత్తు చేస్తోంది. చంద్రబాబుతో పాటు లోకేష్ తదితర నేతలపై కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు రాక సందర్భంగా తెలంగాణలో ర్యాలీ నిర్వహించారని మరో కేసు నమోదైంది.