టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను అరెస్ట్ చేసిన సీఐడీ..

Published : Oct 12, 2022, 10:55 PM IST
టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను అరెస్ట్ చేసిన సీఐడీ..

సారాంశం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సీఐడీ అరెస్ట్ చేసింది.  తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని దారపనేని నరేంద్ర భార్య సౌభాగ్యం అన్నారు. 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సీఐడీ అరెస్ట్ చేసింది. తన భర్తను సీఐడీ అధికారులమని చెప్పి బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లారని దారపనేని నరేంద్ర భార్య సౌభాగ్యం తెలిపారు. ఏడుగురు వ్యక్తులు సీఐడీ అధికారులమని తమ ఇంటికి వచ్చారని చెప్పారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. 

దారపనేని నరేంద్రను సీఐడీ అరెస్ట్ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ రెడ్డి ప్రైవేటు సైన్యంగా మారిన ఏపీ సీఐడీ అర్ధరాత్రి అరాచక అరెస్టులకి మరోసారి తెగబడిందని మండిపడ్డారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ఇంట్లో చొరబడి మరీ సీఐడీ అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. నరేంద్రని ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పలేని తప్పుడు అరెస్టులు ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. 

 


నరేంద్రని ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పలేని తప్పుడు అరెస్టులు ఇంకెన్నాళ్లు? అక్రమ అరెస్టులపై కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ తీరు మారడం లేదని అన్నారు. 41 ఏ నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా..అక్రమ అరెస్టుకి తెగబడిన  అధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. నరేంద్రకి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. 

మరోవైపు నరేంద్ర కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు