మన ఎమ్మెల్యే సింహం.. సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు..!

Published : Sep 30, 2021, 08:04 AM IST
మన ఎమ్మెల్యే సింహం.. సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు..!

సారాంశం

సింహానికే న్యాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు. ఇంకే జంతువుకూ ఉండవన్నారు. ఎక్కడ, ఎవరికీ, ఏం పని చేయాలి.. ఏం సాయం చేయాలి.. అడగక పోయినా చేసేవాడే లీడర్ అంటూ ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపించాడు.

మన ఎమ్మెల్యే సింహం లాంటివాడని.. ఆయనలో న్యాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని... ఎవరికి ఏం అవసరమో ఆయనకు బాగా తెలుసు అంటూ.. అనంతరం జిల్లా గుత్తి సీఐ రాము గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని పొగుడతూ మాట్లాడాడు. కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

మంగళవారం గుత్తిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఎమ్మెల్యే, సీఐ హాజరయ్యారు. సీఐ మాట్లాడుతూ.. మన ఎమ్మెల్యే సార్ సింహం లాంటి వారుని పేర్కొన్నారు. సింహానికే న్యాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు. ఇంకే జంతువుకూ ఉండవన్నారు. ఎక్కడ, ఎవరికీ, ఏం పని చేయాలి.. ఏం సాయం చేయాలి.. అడగక పోయినా చేసేవాడే లీడర్ అంటూ ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపించాడు.

‘వంద గొర్రెలకు ఒక సింహాన్ని లీడర్ చేస్తే.. ఆ వంద గొర్రెలు కూడా సింహాలవుతాయి. మన ఎమ్మెల్యే కూడా మీరు అడగకుండానే అన్నీ  చేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా అది కావాలి.. ఇది కావాలి అడగాల్సిన అవసరం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో వైపు గుత్తి సీఐ రాము అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎస్ఐ సుధాకర్  యాదవ్ పేరుతో డీఎస్పీని ఉద్దేశించి రాసినట్లున్న ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుత్తి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను ఇటీవల వేరే ప్రాంతానికి బదిలీ చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్