సినిమాలతో బాగుపడ్డారు... రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ : పవన్‌పై మాజీ మంత్రి పార్థసారథి ఆగ్రహం

Siva Kodati |  
Published : Sep 29, 2021, 06:50 PM ISTUpdated : Sep 29, 2021, 06:51 PM IST
సినిమాలతో బాగుపడ్డారు... రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ : పవన్‌పై మాజీ మంత్రి పార్థసారథి ఆగ్రహం

సారాంశం

ఏపీ ప్రభుత్వం, వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి కౌంటరిచ్చారు. పవన్ నిజ జీవితంలోనూ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును ఎప్పుడూ ప్రశ్నించలేదంటూ పార్థసారథి మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం, వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి కౌంటరిచ్చారు. పవన్ నిజ జీవితంలోనూ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును ఎప్పుడూ ప్రశ్నించలేదంటూ పార్థసారథి మండిపడ్డారు. స్టార్‌డమ్‌ను అడ్డుకుపెట్టుకుని ఏం మాట్లాడినా చలామణి అవుతుందని అనుకుంటున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. పవన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని పార్థసారథి ప్రశ్నించారు. రాజకీయాల్లో పవన్ అట్టర్‌ ఫ్లాప్ అని.. సినిమా రంగం వల్ల ఆయన బాగుపడ్డారని పార్థసారథి ధ్వజమెత్తారు. కానీ పవన్ వల్ల సినిమా రంగం బాగుపడలేదంటూ ఆయన మండిపడ్డారు. బెనిఫిట్ షోలు ఎన్ని వేస్తున్నారో, బ్లాక్‌లో టికెట్లు ఎన్ని అమ్ముతున్నారో లెక్కా పత్రం లేకుండా చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. నీ బుద్ధి తెలిసి రెండ్రోజులకే నిర్మాతలు ప్రభుత్వం విద్దకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu