ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు యస్ఐ పిల్లి శ్రావణి మృతి !

By AN Telugu  |  First Published May 12, 2021, 9:55 AM IST

గుంటూరు జిల్లా, చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందింది. వేమూరు నియోజకవర్గం చుండూరు పోలీసు స్టేషన్లలో యస్.ఐగా పనిచేస్తున్న పిల్లి.శ్రావణి బుధవారం రోజు తెల్లవారుజామున గుంటూరులోని రమేష్ హస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందారు.


గుంటూరు జిల్లా, చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందింది. వేమూరు నియోజకవర్గం చుండూరు పోలీసు స్టేషన్లలో యస్.ఐగా పనిచేస్తున్న పిల్లి.శ్రావణి బుధవారం రోజు తెల్లవారుజామున గుంటూరులోని రమేష్ హస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందారు.

శ్రావణి స్వగ్రామం ప్రకాశం జిల్లా, కందుకూరు. 2018 బ్యాచ్ నరసరావుపేట లో దిశ పోలీసు స్టేషన్ లో ఫస్ట్ పోస్టింగ్. చుండూరు పోలీసు స్టేషన్లలో 7నెలల నుంచి యస్.ఐ. గా విధులు నిర్వహిస్తున్నారు. గత శనివారం శ్రావణి ఆత్మహత్య యత్నం చేసింది. కాగా ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్ రవీంద్ర ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Latest Videos

కాగా, గత శనివారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. చుండూరు పోలీసు స్టేషన్ ఎస్ఐ శ్రావణి, అదే స్టేషన్ లో పనిచేస్తూ ఒక రోజు ముందు వీఆర్ లోకి వెళ్లిన కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. 

గత ఏడాది అక్టోబర్ లో శ్రావణి చుండూరు పోలీసు స్టేషన్ లో ఎస్సైగా చేరారు. రవీంద్ర ఐదేళ్ల నుంచి అక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఎస్సై శ్రావణితో సన్నిహితంగా మెలిగేవాడని అంటున్నారు 

ఎస్సై శ్రావణి శనివారంనాడు స్టేషన్ కు రాలేదని, వారిద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే విషయం తెలియదని సీఐ రమేష్ బాబు చెప్పారు. అయితే, వారిద్దరు కారులో వెళ్లి ముందుగా తెనాలిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరారని చెప్పారు. 

ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం 1008 ద్వారా గుంటూరులోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. వారు అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుంటామని అన్నారు.

click me!