విజయవాడ మాచవరంలో దారుణం: పాత కక్షలతో సురేష్ ను హత్య చేసిన చౌడేష్

Published : Oct 09, 2022, 10:52 AM ISTUpdated : Oct 09, 2022, 12:34 PM IST
 విజయవాడ మాచవరంలో దారుణం: పాత కక్షలతో సురేష్ ను హత్య చేసిన చౌడేష్

సారాంశం

విజయవాడ మాచవరంలో సురేష్ అనే వ్యక్తినిచౌడేష్ అనే వ్యక్తి ఇవాళ హత్య చేశాడు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

విజయవాడ: నగరంలోని మాచవరంలో దేశీ సురేష్ అనే వ్యక్తిని చౌడేష్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. సురేష్ ను హత్యచేసిన  తర్వాత చౌడేష్ పోలీసులకు లొంగిపోయాడు. ఇద్దరి మధ్యగతకొంత కాలంగా పాత కక్షలున్నాయని  పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.  మృతదేహన్నిపోస్టుమార్టం కోసం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  సురేష్ ను హత్య చేసిన నిందితడు చౌడేష్ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యలు  కోరుతున్నారు.   

2020 లో సురేష్, చౌడేష్ మధ్య గొడవ జరిగింది. భ్యానర్లు కట్టే విషయంలో ఇద్దరి మధ్యగొడవ జరిగిందని పోలీసులు గుర్తించారు. సురేష్ ను కారుతో ఢీకొట్టిన సమయంలో చౌడేష్ తో పాటు ఆయన కారులో మరో ముగ్గురున్నారు. వీరంతా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టారా, లేక పాత కక్షలతోనే ఉద్దేశ్యపూర్వకంగా కారుతో ఢీకొట్టారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరేష్ మృతికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేశారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలాఉంటే సురేష్, చౌడేష్ మధ్య  గతంలో ఘర్షణ జరిగింది. ఈ విషయమై కేసు నమోదైంది.ఈ కేసు ట్రయల్  నడుస్తుందని సురేష్ భార్య  శిరీష మీడియాకు చెప్పారు.  తన బిడ్డకు ఐస్ క్రీం  తెచ్చేందుకు వెళ్లిన సురేష్  ను పథకం ప్రకారంగా చౌడేష్ ను  హత్యచేశారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం  చేయాలని కోరారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్