
తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ పరిహారం అడిగిన గ్రామస్తులను బెదిరించినందుకు గాను డాక్టర్ సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం తమ నుండి తీసుకొన్న భూమికి సంబంధించిన పరిహారం చెల్లించాలని ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేషన్ ను గ్రామస్తులు కోరారు. అయితే గ్రామస్తులపై సురేష్ దురుసుగా మాట్లాడారు. తన వద్ద భద్రతా సిబ్బంది ఉన్నారని వారితో కాల్చి చంపుతానని ఆయన బెదిరించినట్టుగా గ్రామస్తులు ఆరోపించారు.ఈ విషయమై స్థానిక ఆర్డీఓకి స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు ఎయిర్ పోర్టు డైరెక్టర్ పై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ అధేశించారు. ఆర్డీఓ ఆదేశం మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఏర్పేడు పోలీసుస్టేషన్ లో రేణిగుంట ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సురేష్ పై ఐపీసీ 385,166,268,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.