రమ్య కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వోద్యోగం, ఐదెకరాల భూమి: వర్ల రామయ్య డిమాండ్

Arun Kumar P   | Asianet News
Published : Aug 17, 2021, 12:11 PM IST
రమ్య కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వోద్యోగం, ఐదెకరాల భూమి: వర్ల రామయ్య డిమాండ్

సారాంశం

గుంటూరులో దారుణ హత్యకు గురయిన  బిటెక్ విద్యార్థిని రమ్యకు కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించడమే కాదు ఒకరికి ప్రభుత్వోద్యోగం, ఐదెకరాల భూమి ఇవ్వాలని టిడిపి నాయకులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.  

విజయవాడ: ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వారి ఒక్కొ కుటుంబానికి రూ. 1 కోటి రూపాయలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం మృగాడి చేతిలో హత్యకు గురైన దళిత యువతి రమ్య కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి తప్పించుకోవాలనుకోవటం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,  5 ఎకరాల సాగుభూమి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఇవన్నీ ఇవ్వకపోతే జగన్ దళితులకు అన్యాయం చేసినట్టేనని వర్ల పేర్కొన్నారు. 

''జగన్ సిమెంట్ ప్యాక్టరీకి సిమెంట్ బస్తాల కవర్లు తయారు చేసే ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకై చనిపోయిన వారికి రూ. 1 కోటి ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వ చేతకాని, అసమర్ధ పాలన వల్ల ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి రమ్య కుటుంబానికి మాత్రం ముఖ్యమంత్రి జగన్ రూ. 10 లక్షలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తారా? ఇదెక్కడి న్యాయం?  ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ. కోటి ఇచ్చినట్టు రమ్య కుటుంబానికి రూ.1 కోటి ఎందుకు ఇవ్వరు?  ఉన్నత చదువులు చదుకువుని ఉజ్వల భవిష్యత్ ఉన్న రమ్య  ప్రాణాలు పోవటానికి కారణం మీ అసమర్ధ పాలన కాదా? మీ దిశ యాప్, సీసీ కెమెరాలు ఏమయ్యాయి?'' అంటూ వర్ల రామయ్య నిలదీశారు. 

''ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న మాటలు అబద్దాలేనని రమ్య హత్యతో తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ర్టంలో శాంతిభద్రతలు బాగున్నాయని మాట్లాడుతున్న సమయంలోనే గుంటూరులో రమ్య దారుణ హత్యకు గురైంది.  రాష్ర్టంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి?'' అని రామయ్య నిలదీశారు. 

read more  మీకు ఇద్దరు కూతుళ్లున్నారు... వారికే ఇలా జరిగుంటే ఇలాగే స్పందిస్తారా?: జగన్ ను నిలదీసిన లోకేష్

''రమ్య హత్య ఘటనకు సంబందించి సజ్జల రామకృష్ణారెడ్డి దళిత సంఘాలను పిలిపించుకుని వాళ్లను కన్విన్స్ చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ దళిత వర్గాన్ని మోసం చేయటం మానుకోవాలి.  చేతికి అందొచ్చి తమ కుటుంబానికి అండగా ఉంటుదనుకున్న రమ్య మీ ప్రభుత్వ వైపల్యంతో ప్రాణాలు కోల్పోయింది.  రమ్య తల్లితండ్రులు వృద్ద్యాప్యంలో ఉన్నారు. వారి ఆధారం ఎవరు?'' అని అడిగారు.

''వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో దళితులపై అనేక దాడులు జరిగితే ఇంతవరకు దేనిలోను న్యాయం జరగలేదు. ముఖ్యమంత్రి రమ్య విషయంలోనైనా న్యాయం చేయాలి.  సజ్జల దగ్గర వెళ్తున్న దళిత సంఘాలు సజ్జల మాయమాటలు విని మోసపోవద్దు. ఎన్నో కోట్లు దుబారా చేసిన ప్రభుత్వం రమ్య కుటుంబానికి  రూ. 1 కోటి ఇవ్వలేదా? రమ్య కుటుంబానికి 1 కోటి ఇవ్వకపోతే రాష్ర్టంలోని దళితులమంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తాం'' అని వర్ల రామయ్య హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu