అప్పు తీర్చమన్నందుకు హత్య: టెక్కీ భువనేశ్వరీ హత్య కేసులో శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 2, 2021, 5:19 PM IST
Highlights

జిల్లాలోని తిరుపతిలో మహిళా టెక్కీ భువనేశ్వరీ హత్య కేసులో ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేశారు.శుక్రవారం నాడు తిరుపతిలో శ్రీకాంత్ రెడ్డిని  మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.

చిత్తూరు; జిల్లాలోని తిరుపతిలో మహిళా టెక్కీ భువనేశ్వరీ హత్య కేసులో ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేశారు.శుక్రవారం నాడు తిరుపతిలో శ్రీకాంత్ రెడ్డిని  మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.రుయా ఆసుపత్రి వెనుక భాగంలో భువనేశ్వరీ డెడ్‌బాడీని పట్టపగలే కాల్చివేశాడని పోలీసులు చెప్పారు. టెక్కీ భువనేశ్వరిని హత్య చేసిన  తర్వాత కరోనా కారణంగా మరణించిందని కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. 

also read:టెక్కీ భువనేశ్వరి హత్య: భర్త అరెస్టు, సీసీటీవీలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

భువనేశ్వరీ దంపతులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ సీసీకెమెరా ఆధారంగా విచారణ చేస్తే హత్య విషయం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.శ్రీకాంత్ రెడ్డి  ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని  పోలీసులు తెలిపారు.

భర్త నిత్యం డబ్బుల కోసం ఆమెను వేధింపులకు గురిచేసేవాడని తమ విచారణలో తేలిందని చెప్పారు. అంతేకాదు తనకు తెలిసిన వారి నుండి రూ. 10 లక్షలను ఆమె అప్పు తెచ్చి భర్తకు ఇచ్చింది.ఈ అప్పును తీర్చాలని భర్తను కోరింది. ఈ విషయమై భార్యాభర్లల మధ్య గొడవ  జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే భువనేశ్వరిని భర్త శ్రీకాంత్ రెడ్డి హత్య చేశాడని  ఏఎస్పీ తెలిపారు.

భార్యను హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో కరోనాతో ఆమె చనిపోయిందని  బందువులను నమ్మించాడని పోలీసులు చెప్పారు. డెడ్ బాడీని ఎందుకు చూపడం లేదో తేల్చుకొనేందుకు భువనేశ్వరీ బంధువు  రంగంలోకి దిగి అపార్ట్‌మెంట్ సీసీటీవీని పరిశీలిస్తే భువనేశ్వరీ డెడ్ బాడీని సూట్ కేసులో  తీసుకెళ్తున్న శ్రీకాంత్ రెడ్డిని  గుర్తించింది.ఈ దృశ్యాల ఆధారంగా ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. 


 

click me!