ప్రేమోన్మాది చేతిలో యువతి హతం... హోమంత్రి సుచరిత సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Jul 02, 2021, 05:03 PM ISTUpdated : Jul 02, 2021, 05:08 PM IST
ప్రేమోన్మాది చేతిలో యువతి హతం... హోమంత్రి సుచరిత సీరియస్

సారాంశం

గూడూరులో యువతిని అతి కిరాతకంగా హతమార్చిన నిందితుడు వెంకటేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె ఆదేశించారు

గుంటూరు: గూడూరు ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత సీరియస్ అయ్యారు. నిందితుడు వెంకటేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె ఆదేశించారు. అలాగే మృతురాలు తేజస్విని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ... కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రేమ పేరుతో జరిగే ఇలాంటి ఉన్మాద ఘటనలపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళపై దాడులకు తెగబడితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు.

ఇక గూడూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయిన తేజస్విని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి బాధలో వున్న వారిని ఓదార్చారు పద్మ. 

read more  విజయవాడలో సైకో వీరంగం.. అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి వికృతచేష్టలు.. !

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని తిరుపతి రైల్వే లైన్ గేట్ సమీపంలో పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. వీరిక ఇంజనీరింగ్ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం. గురువారం దంపతులిద్దరూ పాఠశాలకు వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఆమె సోదరుడు ఉన్నారు.

చెన్నూరు పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న చిన్నికృష్ణ కుమారుడు వెంకటేష్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఇది దగ్గరే ఉండి పని చేస్తున్నాడు. తేజస్విని, వెంకటేష్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిద్దరూ కలవకుండా కట్టడి చేశారు. 

గురువారం యువతి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే వెంకటేష్ ఆమె ఇంటికి వచ్చాడు. తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వెంకటేష్.. తేజస్విని గొంతులో కత్తితో పొడిచి, ఆపై టవల్ తో గొంతు నులిమి చంపేశాడు. యువతి సోదరుడి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగువారు కిటికీ లోంచి చూడగా బెడ్ మీద తేజస్విని పడిఉంది. స్థానికులు రావడంతో భయపడ్డ వెంకటేష్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. 

ఈ లోపు అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరినీ హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతి చెందిందని.. వెంకటేష్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?