చిత్తూరు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 08, 2024, 09:33 PM ISTUpdated : Mar 08, 2024, 09:36 PM IST
చిత్తూరు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

ఆచార్య ఎన్‌జీ రంగా సహా ఎందరో హేమాహేమీలను చట్టసభల్లో కూర్చోపెట్టిన ఘనత చిత్తూరు సొంతం. తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావించాక సైకిల్ హస్తగతమైంది. 1989, 91 తప్పించి 2014 వరకు తెలుగుదేశం పార్టీయే ఇక్కడ గెలుస్తూ వస్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో మూడు ప్రాంతాల రాజకీయాలు, మూడు సంస్కృతులు ఇక్కడ కనిపిస్తుంటాయి. టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ 2019లో చిత్తూరు లోక్‌సభలో పాగా వేసిన వైసీపీ .. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడిగా పేరున్న రెడ్డప్పను 2024లోనూ మరోసారి బరిలోకి దించే అవకాశాలు పుష్కళంగా వున్నాయి. 

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో వుండే చిత్తూరు రాజకీయాలు విభిన్నంగా వుంటాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో మూడు ప్రాంతాల రాజకీయాలు, మూడు సంస్కృతులు ఇక్కడ కనిపిస్తుంటాయి. రాయలసీమ పరిధిలోకి వచ్చినా ప్రశాంత వాతావరణం చిత్తూరు సొంతం. చిత్తూరు పార్లమెంట్ గతంలో జనరల్ కేటగిరీలో వుండేది.. ప్రస్తుతం ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఆచార్య ఎన్‌జీ రంగా సహా ఎందరో హేమాహేమీలను చట్టసభల్లో కూర్చోపెట్టిన ఘనత చిత్తూరు సొంతం. తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావించాక సైకిల్ హస్తగతమైంది. 1989, 91 తప్పించి 2014 వరకు తెలుగుదేశం పార్టీయే ఇక్కడ గెలుస్తూ వస్తోంది. 

చిత్తూరు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి కంచుకోట :

1952లో ఏర్పడిన చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించగా.. టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ స్థానాలున్నాయి. కమ్మ, రెడ్డి, శెట్టి బలిజ, దళిత, మైనార్టీ ఓటర్లు ఇక్కడ అధికం. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో 15,66,499 మంది ఓటర్లు వుండగా.. వీరిలో పురుషులు 7,86,645 మంది.. మహిళలు 7,79,702 మంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో 13,19,472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 84.23 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో 6 వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కుప్పంలో మాత్రమే విజయం సాధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఎన్ రెడ్డప్పకు 6,86,792 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి నరమల్లి శివప్రసాద్‌కు 5,49,521 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 1,37,271 ఓట్ల మెజారిటీతో చిత్తూరును సొంతం చేసుకుంది. 

చిత్తూరు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ 2019లో చిత్తూరు లోక్‌సభలో పాగా వేసిన వైసీపీ .. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడిగా పేరున్న రెడ్డప్పను 2024లోనూ మరోసారి బరిలోకి దించే అవకాశాలు పుష్కళంగా వున్నాయి. టీడీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. ప్రస్తుతం టీడీపీకి ఇక్కడ ఇన్‌ఛార్జ్ లేదు. మారిన పరిస్ధితుల నేపథ్యంలో ఈసారి చిత్తూరులో పసుపు జెండా ఎగరడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. చివరి నిమిషంలో కొత్త వ్యక్తిని దింపినా గెలవొచ్చని చంద్రబాబు సైతం ధీమాగా వున్నారు. అయితే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ కూడా చిత్తూరుపై కన్నేసింది. ఈ ప్రాంతంలో శెట్టి బలిజ, తెలగ కమ్యూనిటీ ఎక్కువగా వుండటంతో గెలుస్తామని జనసేన భావిస్తోంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!