రేపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

By Arun Kumar PFirst Published Mar 8, 2024, 9:29 PM IST
Highlights

రేపల్లె : ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి జెండా ఎగరని అతికొద్ది నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభంజనం సృష్టించినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గాలి వీచినా... రేపల్లె ప్రజలు మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేపల్లె సీటు టిడిపికే దక్కింది. దీంతో ఈసారి ఎలాగైన రేపల్లెపై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో వైసిపి వుంది.... టిడిపి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో రేపల్లె రిజల్ట్ ఎలా వుంటుందోనన్న ఆత్రుత రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ వుంది. 

రేపల్లె రాజకీయాలు : 

ఉమ్మడి గుంటూరు ప్రస్తుత బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ వుండేది. అయితే టిడిపి ఆవిర్భావం తర్వాత  కాంగ్రెస్ నేత యడ్ల వెంకటరావు టిడిపిలో చేరి వరుసగా రెండుసార్లు (1983,1985) విజయం సాధించారు. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ కూడా రెండుసార్లు (2014, 2019) విజేతగా నిలిచారు. 

Latest Videos

ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా రేపల్లె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహించారు.  వీరు కాంగ్రెస్ లో వుండగా రేపల్లె నుండి పోటీచేసారు... కానీ ప్రస్తుతం అంబటి సత్తెనపల్లి నుండి, మోపిదేవి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

రేపల్లె అసెంబ్లీ పరిధిలోని మండలాలు : 

నిజాంపట్నం
నాగారం 
చెరుకుపల్లె 
రేపల్లె 

రేపల్లె నియోజకవర్గ ఓటర్లు : 

రేపల్లె నియోజకవర్గంలో 2019 ఎన్నికల ప్రకారం  2,23,738 మంది ఓటర్లు వున్నారు.  

పురుషులు -  110899

మహిళలు - 112810 

రేపల్లె అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

రేపల్లె వైసిపి అభ్యర్థి : 

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2014,19) టిడిపి చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో వైసిపి అభ్యర్థిని మార్చింది. సీనియర్ లీడర్ మోపిదేవి వెంకటరమణను కాకుండా ఈపూరు గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. 

రేపల్లె టిడిపి అభ్యర్థి :

వరుసగా రెండుసార్లు రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యప్రసాద్ కే మరోసారి టిడిపి అవకాశం ఇచ్చింది. 2014 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనగాని పట్టుదలతో వున్నారు. 

రేపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

రేపల్లె అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు  2,23,738 

పోలైన ఓట్లు 1,86,123 

టిడిపి - అనగాని సత్యప్రసాద్ - 89,975 (48 శాతం) - 11,555 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి ‌- మోపిదేవి వెంకటరమణ - 78,420 (42 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ ‌- కమతం సాంబశివరావు -11,761 (6 శాతం) 

రేపల్లె అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలైన ఓట్లు 1,86,123 

టిడిపి - అనగాని సత్యప్రసాద్ - 89,975 (48 శాతం) - 11,555 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి ‌- మోపిదేవి వెంకటరమణ - 78,420 (42 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ ‌- కమతం సాంబశివరావు -11,761 (6 శాతం) 

రేపల్లె అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు  2,09,371 

పోలైన ఓట్లు 1,74,773

టిడిపి - అనగాని సత్యప్రసాద్ - 85,076 (48 శాతం) - 13,355 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి ‌- మోపిదేవి వెంకటరమణ - 71,721 (41 శాతం) - ఓటమి 

 
 

click me!