పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి వస్తున్నారు: నాదెండ్ల మనోహర్

Published : Jan 27, 2021, 02:10 PM ISTUpdated : Jan 27, 2021, 03:36 PM IST
పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి వస్తున్నారు: నాదెండ్ల మనోహర్

సారాంశం

తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ కల్యాణ్ కు మద్దతు ఇస్తానని చిరంజీవి చెప్పారని ఆయన అన్నారు.

అమరావతి: తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంట మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో మద్దతు ఇస్తానని చిరంజీవి చెప్పనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది చిరంజీవేనని ఆయన అన్నారు. కొద్ది కాలం సినిమాలు చేయాలని పవన్ కు చిరంజీవి సూచించారని ఆయన అన్నారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తానూ ఉంటానని అంతర్గత భేటీలో చిరంజీవి చెప్పారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తల భేటీలో ఆయన ఆ విషయాలు చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపితో కలిసి అన్ని చోట్లా పోటీ చేస్తామని ఆయన చెప్పారు. గత ఘటనల దృష్ట్యా గత ఘటనల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బిజెపి, జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఏకగ్రీవాలపై అధికార పార్టీ నాయకులు మాట్లాడిన మాటలపై ఇరు పార్టీల నేతలం గవర్నర్ ను కలుస్తామని ఆయన చెప్పారు. వైసీపీ నాయకుల మాటలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లున్నాయని ఆయన అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలు గుప్పించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. యువతను ప్రోత్సహించే విధంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మనోహర్ అన్నారు. 

గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. హింసాత్మక సంఘటనలకు చోటు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. అభ్యర్తులు నామినేషన్లు వేయకుండా బిదెరిచే ధోరణికి కళ్లెం వేయాలని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్