తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ బుధవారం విజయవాడలో మీడియా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్రైస్తవులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఖండిస్తున్నాం అన్నారు.
undefined
చంద్రబాబు నాయుడు క్రైస్తవులు బలవంతపుమత మార్పిడిలు చేస్తున్నారంటూ దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వాటిని నిరూపించాలి. ఎన్నికల సమయంలో మీ మ్యానిఫెస్టోలో పాస్టర్ లకు ఐదు వేలు ఇస్తామని పెట్టలేదా...? అంటూ ప్రశ్నలు సంధించారు.
కరోనా సమయంలో ఆదుకోవడానికి ప్రభుత్వం 5 వేలు ఇస్తే చంద్రబాబు కడుపుమంటతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా మత గురువుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకోలేదా...? అని అడిగారు.
చంద్రబాబు క్రైస్తవుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోరుతున్నం అన్నారు.
ఇప్పుడు కేవలం 13 జిల్లాల నాయకులతోనే సమావేశం అయ్యాం. ఇక ముందు అన్ని జిల్లాలలో పర్యటించి చంద్రబాబు వ్యాఖ్యలపై నిరసనలు తెలుపుతామని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.