చిన్నమ్మ కొత్త ఎత్తులు

Published : Feb 14, 2017, 11:00 AM ISTUpdated : Mar 24, 2018, 12:12 PM IST
చిన్నమ్మ కొత్త ఎత్తులు

సారాంశం

అనారోగ్యమని, తీర్పు అమలును నాలుగు వారాలపాటు వాయిదావేయాలని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసుకున్నారు.

సుప్రింకోర్టు తీర్పు నుండి తప్పించుకునేందుకు చిన్నమ్మ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆదాయానికిమించిన ఆస్తుల విషయంలో శశికళకు కోర్టు నాలుగేళ్ళ జైలు, రూ. 10 కోట్లు జరిమానా విధించింది. కోర్టు తీర్పుతో శశికళకు ఇక జైలేగతి అని అనుకున్నారు అందరూ.  దానికి తోడు తక్షణమే లొంగిపోవాలని కూడా కోర్టు ఆదేశించింది. దాంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అర్ధంకావటం లేదు. సాయంత్రానికి చిన్నమ్మ పోలీసులకు లొంగిపోతారని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లే పోలీసులు కూడా శశికళ ఉన్న రిసార్ట్స్ కు చేరుకున్నారు పెద్ద ఎత్తున. ఈ నేపధ్యంలోనే కోర్టు తీర్పు తక్షణం అమలులోకి రాకుండా చిన్నమ్మ కొత్త ఎత్తులు వేస్తున్నారు.

 

తనకు అనారోగ్యమని చెబుతున్నారు. తనకు స్వస్తత చేకూరటానికి నాలుగువారాలు పడుతుందని చెప్పారు. కాబట్టి తీర్పు అమలును నాలుగు వారాలపాటు వాయిదావేయాలని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసుకున్నారు. శశికళ విజ్ఞప్తిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఒకవేళ చిన్నమ్మకు నాలుగు వారాల సమయం దొరికితే, ఆమె క్యాంపులో ఉన్న ఎంఎల్ఏల్లో అత్యధికులు పన్నీర్ వైపు వెళ్ళే అవకాశాలు దాదాపు లేవు. అదే కోర్టు గనుక సమయం ఇవ్వకుండా సాయంత్రమే అదుపులోకి తీసేసుకుంటే మాత్రం ఎంతమంది ఎంఎల్ఏలు పళనిస్వామికి మద్దతుగా నిలుస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?