మీడియా ప్రతినిధులపై చిన్న జీయర్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ జీయర స్వామి మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు జీయర స్వామి సీరియస్ అయ్యారు.
విజయవాడ: కోడిగుడ్డుపై వెంట్రుకలు లాగడం మీడియాకు బాగా తెలుసునని Chinna jeeyar swamy విమర్శించారు.శుక్రవారం నాడు ఆయన Vijayawadaలో మీడియాతో మాట్లాడారు.
మా కార్యక్రమాల గురించి తెలుసుకొని ప్రశ్నలు వేయడం తెలుసుకోవాలని ఆయన Mediaప్రతినిధులకు సూచించారు. ప్రశ్న అడిగేందుకు అవకాశం వచ్చిందని భావించి ప్రశ్నలు వేయవద్దని కూడా జీయర్ స్వామి మీడియా ప్రతినిధులకు హితవు పలికారు. తన పేరుతో బ్యాంకు ఖాతా కూడా లేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన కానీ, కోరిక కానీ తనకు లేవన్నారు. తన మనసులోకి ఈ విషయం ఏనాడూ రాలేదని చెప్పారు.
undefined
దేనికైనా కొన్ని నియమాలుంటాయని జీయర్ స్వామి చెప్పారు.ఒక పద్దతిలో వెళ్లాలనుకొనే వారికి కొన్ని పద్దతులు నియమాలుంటాయని ఆయన చెప్పారు. సంప్రదాయ దీక్ష చేసేవారికి మాంసాహరం తగదని తాను చెప్పానని జీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయమై పూర్వా;పరాలు తెలుసుకోకుండా ప్రశ్నలు వేసిన వారిని ప్రశ్నిస్తానని జీయర్ స్వామి చెప్పారు.
మాంసాహారం గురించి తాను ఏమి మాట్లాడానో పూర్వాపరాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేసే వారి గురించి తాము కామెంట్ చేస్తామని జీయర్ స్వామి తేల్చి చెప్పారు. ప్రకరణను, విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అనేది సరైంది కాదన్నారు. సమాజం పట్ల బాధ్యత గల మీడియా ప్రతినిధులుగా ఇది తగదన్నారు.
సమాజానికి సరైన సమాచారం ఇవ్వడం మీడియా ప్రతినిధులుగా మీ బాధ్యత అని తెలుసుకోవాలన్నారు. సెన్సిటైజ్ చేయడం కూడా సరైంది కాదన్నారు. ప్రజలకు ఏమీ జరిగిందో వాస్తవ సమాచారం ఇవ్వడమే మీ బాధ్యత అని జీయర్ స్వామి మీడియా ప్రతినిధులకు చెప్పారు. మోకాలికి, బోడి గుండుకు ముడి పెట్టొద్దని జీయర్ స్వామి హితవు పలికారు.