పీఆర్సీ: ఆన్‌లైన్‌లో ఆశుతోష్ మిశ్రా నివేదిక, హైకోర్టులో ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు

By narsimha lode  |  First Published Mar 9, 2022, 9:43 AM IST

ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను  జగన్ సర్కార్ ఆన్‌లైన్ లో ఉంచింది.ఈ నివేదిక కోసం ఉద్యోగ సంఘాలు గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


అమరావతి: ఉద్యోగుల పీఆర్సీ ప్రక్రియలో భాగంగా నియమించిన Ashutosh Mishra కమిషన్ నివేదికను ఆన్‌లైన్ లో ఉంచింది జగన్ సర్కార్. ఆశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయట పెట్టాలని ఉద్యోగ సంఘాలు  డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

PRC  విషయమై Employees నేతలు గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  హైకోర్టు విచారణ చేస్తుంది. పీఆర్సీపై AP High Court గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల వేతనాల్లో కోత విధించవద్దని  హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన పీఆర్సీ వలన తమకు అన్యాయం జరుగుతుందని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్  జేఏసీ నేత  Krishnaiah  ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెబుతున్నారు. పీఆర్సీ జీవోలపై మూడు వారాల్లో Counter దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఈ విషయమై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Latest Videos

ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై  జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.  పీఆర్సీ అమల్లో భాగంగా ఇప్పటివరకు తీసుకొన్న నిర్ణయాలను జీవోల్లో ఏపీ ప్రభుత్వం  పొందుపర్చింది. 

ఏపీ హైకోర్టు సూచనలతో ఇప్పటికే ఆశుతోష్ మిశ్రా నివేదికను ఆన్ లైన్ లో  ఉంచింది. అశుతోష్ మిశ్రా అందించిన పీఆర్సీ రిపోర్ట్ లోని ఏడు భాగాలుగా ఆన్‌లైన్ లో ప్రభుత్వం ఉంచింది.

కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు జీతాలు నుంచి ఎటువంటి రికవరీలు చేయొద్దని ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన  ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. పీఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు యధాస్థితిలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గత నెల 7వ తేదీ నుండి  తలపెట్టిన సమ్మెను విరమించారు. అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాయి. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ చర్చల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆందోళన బాట పట్టాయి.

ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక టీడీపీ, లెఫ్ట్ పార్టీలున్నాయని ఆయన విమర్శించారు. ఉపాధ్యా సంఘాల వెనుక ఈ పార్టీలున్నాయన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చల సమయంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు చివరి నిమిషంలో చర్చల నుండి వెళ్లిపోవడాన్ని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

click me!