‘అల్లరి పిల్ల’ పేరుతో అర్థనగ్నవల.. ఫోన్ మాట్లాడుతూ లక్షలకు టోకరా.. మోసగాళ్ల అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published Mar 9, 2022, 6:44 AM IST

అమ్మాయి తీయగా మాట్లాడితే చాలు ఒళ్లుపై మరిచిపోతారు. ఇక అర్థనగ్న వీడియో కాల్స్ అయితే.. ఆ వీక్నెస్ నే ఛాన్స్ గా తీసుకుంది ఓ ముఠా. ‘అల్లరి పిల్ల’ పేరుతో ఓ ఫేస్ బుక్ ఫ్రొఫైల్ క్రియేట్ చేసి.. దాంతో వలవేసి నగదు దోచేస్తూ ముంచేస్తున్నారు. 



చిత్తూరు : social mediaలో మోసాలు ఈ రోజుల్లో చాలా మామూలుగా మారిపోయాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా లాంటి మాధ్యమాలతో వల వేస్తూ.. మోసాలకు పాల్పడుతూ.. నగదు కాజేస్తున్న ఘటనలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా అమాయకంగా అందులో చిక్కుకుని ఆ తరువాత బాధ పడేవారు. బ్లాక్ మెయిల్ తో మానసికంగా కుంగిపోయేవారు చాలామందే ఉంటున్నారు. అలా యువకులకు అర్థనగ్న చాటింగుల పేరుతో వలవేసి దోచుకుంటున్న facebook లోని ‘అల్లరి పిల్ల’ అకౌంట్ మోసగాళ్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. 

ఫేస్బుక్ లో అల్లరి పిల్ల ఖాతా ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని తీయటి మాటలతో ముగ్గులోకి దించి వారితో అర్ధ నగ్న వీడియో కాల్స్ మాట్లాడి ఆపై ఫోన్ ను హ్యాక్ చేసి నగదు కాజేసే ఎనిమిది మంది సభ్యుల మోసగాళ్ల ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై చిత్తూరు టూటౌన్ స్టేషన్లో మంగళవారం డిఎస్పి సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  చిత్తూరుకు చెందిన సి కె మౌనిక్ ‘allari pilla’ వలలోపడి రూ.3,64,227 మోసపోయాడు. అతడి ఫిర్యాదుతో ఎస్పీసెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు టౌన్ సిఐ యుగంధర్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది.

Latest Videos

undefined

Facebookలో అల్లరిపిల్ల Profile సృష్టించి కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. ఆ account ద్వారా వీరు అమాయకులను ఆసరాగా చేసుకుని Friend Request పంపితే వాటిని అంగీకరించిన వెంటనే ఖాతా ప్రొఫైల్ ఫోటోలోని మహిళ మెసేజ్ చాట్ చేస్తుంది.  క్రమేపి వీడియో చాట్ కు ఆహ్వానించి లింక్ పంపుతుంది. దాన్ని క్లిక్ చేయగానే ఫోటోలోని మహిళ అర్ధనగ్నంగా వీడియో కాల్ మాట్లాడి.. అవతలి వ్యక్తి ఫోన్ ఆపరేటింగ్ యాక్సెస్ ను తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఆపై అతను ఫోన్ లో ఏం టైప్ చేసినా..  మహిళ వాటిని చూసే వెసులుబాటు ఉంటుంది.

నగరానికి చెందిన సి.కె మౌనిక్ ఇదే రీతిన లింక్ ను క్లిక్ చేసి ఆ మహిళతో వీడియో కాల్ మాట్లాడాడు. అతడి ఖాతా వివరాల ఆధారంగా రూ.3,64,227 ను తస్కరించి దాన్ని ముఠాలోని ఇతర సభ్యులకు పంపింది. అతడు దీనిపై ఈనెల మూడో తేదీన ఫిర్యాదు చేశాడు. ఐదు రోజుల్లోనే అల్లరిపిల్ల మోసగాళ్ళను గుర్తించాం. మంగళవారం విశాఖపట్నంకు చెందిన అడప సాంబశివరావు (32), ఆనంద్ మెహతా (35), గొంతెన శ్రీను (21), చందపరపు కుమార్ రాజా (21), లోకిరెడ్డి మహేష్ (24), గొంతెన శివ కుమార్ (21), వరంగల్ కు చెందిన తోట శ్రావణ్ కుమార్ (31), కడపకు చెందిన చొప్ప సుధీర్ కుమార్ అలియాస్ సుకు అలియాస్ హనీ (30)ని అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ వివరించారు. ఈ కేసులో ముపట్ల మానస అలియాస్ అల్లరి పిల్ల పరారీలో ఉందని చెప్పారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన సీఐ యుగంధర్, ఎస్సైలు మల్లికార్జున, లోకేష్ ను డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. 

click me!