చీపురుపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

Published : Jun 04, 2024, 10:11 AM ISTUpdated : Jun 06, 2024, 05:01 PM IST
చీపురుపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

సారాంశం

బొత్స అంటే చీపురుపల్లి.. చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురులేకుండా పోయింది. టీడీపీ ఆరు సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ , ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి. బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదిపారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కీలక నియోజకవర్గం చీపురుపల్లి. దాదాపు రెండు దశాబ్ధాలుగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బొత్స అంటే చీపురుపల్లి.. చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. ఈ సెగ్మెంట్ పరిధిలో వారు దాదాపు 80 శాతం వరకు వుంటారని అంచనా.

చీపురుపల్లిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,228 మంది. వీరిలో పురుషులు 1,13,394 మంది.. మహిళలు 1,15,823 మంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. చెరుకు, మొక్కజోన్న, వరి, బొప్పాయి పంటలను చీపురుపల్లిలో ఎక్కువగా పండిస్తారు. అలాగే ఫేకర్ ఫెర్రో పరిశ్రమ ఇండస్ట్రీయల్ ఫెర్రో పరిశ్రమ కూడా చీపురుపల్లిలో కేంద్రీకృతమై వుంది. 

చీపురుపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. తెలుగుదేశానికి కంచుకోట :

చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురులేకుండా పోయింది. అయితే బొత్స సత్యనారాయణ ఎంట్రీ తర్వాత పరిస్ధితులు మారిపోయాయి. టీడీపీ ఆరు సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ , ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి.

ఇక బొత్సకు ఇక్కడ తిరుగులేని ఫాలోయింగ్ వుంది. నాలుగు మండలాల్లోనూ పటిష్టమైన కేడర్ వుంది. టీడీపీకి కంచుకోట వంటి చీపురుపల్లిలో బొత్స ఎంట్రీ తర్వాత పరిస్ధితులు తలకిందులై.. ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది. 2004, 2009లో ఇక్కడి నుంచి గెలిచిన బొత్స వైఎస్ , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లలో కీలక శాఖలు నిర్వహించారు. అలాగే పీసీసీ చీఫ్‌గా, ఒకానొక దశలో సీఎం రేసులోనూ బొత్స నిలిచారు. 

2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాగా.. బొత్స సత్యనారాయణ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం వైసీపీలో చేరిన ఆయన తిరిగి రాజకీయాలను శాసిస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణకు 89,262 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కిమిడి నాగార్జునకు 62,764 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 26,498 ఓట్ల ఆధిక్యంతో చీపురుపల్లిలో తొలిసారిగా జెండా పాతింది. 2024లోనూ బొత్స సత్యనారాయణ మరోసారి బరిలో దిగుతున్నారు.

చీపురుపల్లి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బొత్సపై అస్త్రంగా గంటా శ్రీనివాసరావు :

అయితే బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కిమిడి నాగార్జునను ఇంచార్జ్‌గా ప్రకటించినా.. టీడీపీ కేడర్‌‌లో ఎలాంటి బలం కలగలేదంటున్నారు. ఈ నేపథ్యంలో సత్తిబాబును ఢీకొట్టే నేత కోసం చంద్రబాబు వెతుకుతున్నారు. ఆయనే గంటా శ్రీనివాసరావు. అంగ, అర్ధ బలాల్లో బొత్సకు సమఉజ్జీ గంటాయేనని బాబు నమ్మకం. అలాగే రాజకీయాల్లో మోస్ట్ లక్కీయెస్ట్ లీడర్‌గా గంటాకు పేరు. ఆయన ఏ పార్టీలో , ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారన్న సెంటిమెంట్ ప్రజల్లో వుంది. 

చీపురుపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

చీపురుపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై టీడీపీ అభ్యర్థి కళావెంకటరావు కిమిడి 11,971 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బొత్స సత్యనారాయణకు 76254 ఓట్లు రాగా, కిమిడి కళావెంకటరావు 88225 ఓట్లు సాధించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్