Alur Assembly elections result 2024 : ఆలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

By Shivaleela Rajamoni  |  First Published Jun 4, 2024, 10:10 AM IST

Alur Assembly elections result 2024 live : ఆలూరు సెగ్మెంట్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడిప్పుడే పరిస్ధితుల్లో మార్పులు వస్తున్నాయి.  1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,098 మంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీదే ఇక్కడ హవా. మధ్యలో టీడీపీ గెలిచినా హస్తం పార్టీకి ఎదురులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆలూరులో 9 సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు. ఓ మూలకి విసిరేసినట్లు, కర్ణాటక సరిహద్దులను ఆనుకుని వుండే ఈ నియోజకవర్గం విభిన్న ఆచార వ్యవహారాలకు కేంద్రం.  బోయ , రెడ్డి సామాజికవర్గాలదే ఆలూరులో ఆధిపత్యం. ఆలూరు వైసీపీ అభ్యర్ధిగా విరూపాక్షిని ప్రకటించారు జగన్. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. టీడీపీ ఆలూరులో గెలిచి దాదాపు 30 ఏళ్లు కావొస్తోంది. 


Alur Assembly elections result 2024 live :  ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గం ఆలూరు. ఓ మూలకి విసిరేసినట్లు, కర్ణాటక సరిహద్దులను ఆనుకుని వుండే ఈ నియోజకవర్గం విభిన్న ఆచార వ్యవహారాలకు కేంద్రం. కరువు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం నుంచి వలసలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఆలూరు సెగ్మెంట్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడిప్పుడే పరిస్ధితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దేవనకొండ, హోళగుంద, హలహర్వి, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి మండలాలున్నాయి. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,098 మంది. 

ఆలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌ కంచుకోట :

Latest Videos

undefined

నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీదే ఇక్కడ హవా. మధ్యలో టీడీపీ గెలిచినా హస్తం పార్టీకి ఎదురులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆలూరులో 9 సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు. బోయ , రెడ్డి సామాజికవర్గాలదే ఆలూరులో ఆధిపత్యం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గుమ్మనూరు జయరాంకు 1,07,101 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కోట్ల సుజాతమ్మకు 67,205 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా జయరాం 39,896 ఓట్ల మెజారిటీతో ఆలూరులో వరుసగా రెండోసారి విజయం సాధించారు. 

ఆలూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. మూడు దశాబ్ధాలుగా గెలవని టీడీపీ :

2024 ఎన్నికల నాటికి పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. ఆలూరులో మరోసారి గెలవాలని భావిస్తున్న జగన్ .. జయరాంకు టికెట్ నిరాకరించి ఆయనను కర్నూలు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. కానీ జయరాం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోగా.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆలూరు వైసీపీ అభ్యర్ధిగా విరూపాక్షిని ప్రకటించారు జగన్. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. టీడీపీ ఆలూరులో గెలిచి దాదాపు 30 ఏళ్లు కావొస్తోంది.

1994లో చివరిగా సారిగా ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం ఇక్కడ విజయం సాధించింది. తర్వాత చంద్రబాబు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని వ్యూహాలు మార్చినా ఆలూరు ఓటర్లు తిరస్కరిస్తూనే వున్నారు. టీడీపీ తరపున వీరభద్ర గౌడ్ బరిలోకి దిగారు.

click me!