విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం... సిసి కెమెరాల్లో భయానక దృశ్యాలు

By Arun Kumar P  |  First Published Dec 1, 2021, 11:14 AM IST

చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో విజయవాడలో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ అపార్ట్ మెంట్ లో ఈ ముఠా దొంగతనానికి పాల్పడి బంగారం, నగదు దోచుకెళ్లింది. 


విజయవాడ: భయంకరమైన దోపిడీదొంగల ముఠా కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. విజయవాడ 2 టౌన్ పరిధిలో అర్ధరాత్రి చెడ్డి గ్యాంగ్ హల్ చల్ వీడియో సిసి కెమెరాల్లో రికార్డయ్యింది.  దీంతో ఎప్పుడు ఎవరి ఇంటిపై విరుచుకుపడతారోనని నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సిసి కెమెరా వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సోమవారం vijayawada చిట్టీనగర్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్లోని ఓ ఫ్లాట్ లో డబ్బు, బంగారం చోరీకి గురయ్యింది. ఫ్లాట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసి కెమెరాలను పరిశీలించగా cheddi gang పనిగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Latest Videos

undefined

read more  ఎస్ఐని చంపిన మేకల దొంగలు.. 24 గంటల్లో నిందితులు అదుపులోకి..

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్దగల అపార్ట్ మెంట్ లోకి సోమవారం తెల్లవారుజామున 3.15గంటల సమయంలో చెడ్డిగ్యాంగ్ సభ్యులు ప్రవేశించారు. మొదటి అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ జి18కు తాళం వేసివుండటాన్ని గమనించారు. దీంతో తాళం పగలగొట్టి ఫ్లాట్ లోకి ప్రవేశించిన ఈ ముఠా సభ్యులు బంగారంతో పాటు నగదు దోచుకున్నారు. 

ఉదయం తన ఫ్లాట్ లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్ మెంట్ లోని సిసి కెమెరాలను పరిశీలించగా చెడ్డీ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ఆగడాలను అడ్డకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

read more  విజయవాడలో వృద్ధుడి హత్య.. తల, మొండెం వేరుచేసి దారుణం.. (వీడియో)

అనంతపురంలో పార్థీ గ్యాంగ్ కలకలం 

ఇదిలావుంటే ఇటీవల అనంతపురం జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండు ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. అయితే కేవలం దోపిడీమాత్రము కాకుండా   ఉషారాణి (47) అనే టీచర్ ను హతమార్చి శివమ్మ అనే మరో మహిళను తీవ్రంగా గాయపరిచారు. జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య  ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది.

ఈ తరహా దొంగతనాలు జిల్లా ఏపీకి చెందిన దొంగల పని అయివుండదని...  మధ్యప్రదేశ్ కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ, టీచర్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్ఠీ గ్యాంగ్ జిల్లాలో ప్రవేశించిందా అన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పి డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

ఇలా పార్థీ గ్యాంగ్ అరాచకాలు ఓవైపు కొనసాగిస్తుంటే మరోవైపు ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ రాష్ట్రంలోకి ఎంటరయ్యింది. ఇలా అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాలు రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతూ భయానక వాతావరణ సృష్టిస్తున్నాయి. ఈ ఘుఠాల ఆటకట్టించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

 

click me!