నందినిని చంపింది నరేషే.. ప్రేమించి, గర్బవతిని చేసి, పెళ్లి చేసుకుందామనడంతో దారుణం...

By AN TeluguFirst Published Dec 1, 2021, 10:48 AM IST
Highlights

;ప్రేమించి,గర్బవతిని చేయడంతో నందిని, నరేష్ ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది.  ఇష్టం లేని అతను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.  ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఈనెల 13న బైక్ పై నుంచి తిమ్మాపురం వైపు వెళ్లే  కపిల బండ  పొదల్లోకి తీసుకెళ్ళాడు.  అక్కడ బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడు.

అనంతపురం : కంబదూరు మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నరాయుడు కుమార్తె  నందిని (22) మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను murder చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెలుగుచూసింది. కళ్యాణదుర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. నందిని, కనగానపల్లి మండలం  భానుకోటకు చెందిన నరేష్ ప్రేమించుకున్నారు.

శారీరకంగానూ ఒకటయ్యారు. ఈ క్రమంలో ఆమె marriage చేసుకోవాలని ఒత్తిడి చేసింది.  ఇష్టం లేని అతను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.  ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఈనెల 13న బైక్ పై నుంచి తిమ్మాపురం వైపు వెళ్లే  కపిల బండ  పొదల్లోకి తీసుకెళ్ళాడు.  అక్కడ బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడు.

మృతదేహాన్ని ఈనెల 18న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే dead body కుళ్లిపోయింది.  పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో suicide చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు. కానీ పోస్టుమార్టంలో ఆమె pregnant అని తేలింది. ఆమె అన్న కుళ్లాయిస్వామికి అనుమానం వచ్చి కంబదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా... నందినిని నరేష్ హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అతన్ని మంగళవారం నూతిమడుగు సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 

అప్పు తీసుకుని ఒకరు, చేతబడి పేరుతో మరొకరు... వృద్ధుడి గొంతుకోసి దారుణంగా చంపేశారు..

కాగా, మహబూబ్ నగర్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో భార్య Attack చేయగా భర్త మృతి చెందిన ఘటన Nagar Kurnool జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లత్తీపూర్ గ్రామానకి చెందిన మూడవత్ ఈర్యా నాయక్ (55), ద్వాలీ దంపతులు. వీరి కుమారుడు, కోడలికి కొంతకాలం క్రితం  Conflicts వచ్చాయి. 

దీంతో కోడలు పుట్టింటికి వెళ్లింది. ఎన్నిసార్లు అడిగినా రావడం లేదు. ఈ విషయం మీద మంగళవారం కల్వకుర్తి పట్టణంలో పంచాయతీ ఉండగా ఈర్యా నాయక్, ద్వాలీ కలిసి వెళ్లాల్సి ఉంది. కాగా, పక్క ఊరికి వెళ్లిన భర్త ఈర్యా నాయక్ సకాలంలో ఇంటికి రాలేదు. దీంతో ఈర్యా నాయక్ రాగానే పంచాయతీకి వెళ్లాల్సి ఉందని భార్య గొడవకు దిగింది. 

తిరుమల ఘాట్ మూసివేత.. తృటిలో తప్పిన పెను ప్రమాదం, రాకపోకలు బంద్ (వీడియో)

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగింది. ఆ గొడవతో ద్యాలీ తీవ్ర ఆవేశానికి గురైంది. పక్కనే ఉన్న Stickతో భర్త ఈర్యా నాయక్ headమీద కొట్టగా.. తీవ్రంగా గాయపడిన ఈర్యా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో. అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్సై రమేష్ అజ్మీరా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈర్యా నాయక్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

click me!