నెల్లూరు వైసీపీలో మార్పుల కలకలం? ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ వెనుక మతలబేంటి? టికెట్ దక్కేనా?

By SumaBala BukkaFirst Published Dec 25, 2023, 1:36 PM IST
Highlights

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిలతో భేటీ అయ్యారు. 

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాలు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసిపిని ఓడించడమే ధ్యేయంగా ఇప్పటికే  టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎటువైపు మొగ్గు చూపుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ‘జై భారత్ నేషనల్ పార్టీ’  పేరుతో మరో కొత్త పార్టీ కూడా పుట్టుకొచ్చింది.  

ఇవి కాకుండా అధికార వైసిపి ‘వై నాట్ 175’  పేరుతో ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే  వైసీపీలో జరుగుతున్న మార్పులు, చేర్పులు తీవ్ర ఆందోళనకరంగా  పరిణమించాయి. ఇప్పుడు నెల్లూరు వైసీపీలో కూడా ఈ మార్పుల రగడ మొదలయ్యింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు, మరో రెండు నియోజకవర్గాల్లో నేతల మారుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిలతో భేటీ అయ్యారు. ఇదే చర్చనీయాంశంగా మారింది.

Chandrababu Naidu: టీడీపీ ఆకర్ష్ ఆపరేషన్ స్టార్ట్?.. చంద్రబాబు వ్యాఖ్యల మర్మం ఏమిటీ?

మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో  ముగ్గురు నేతలను మార్చాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్, మహిధర్ రెడ్డి, ప్రతాపరెడ్డిల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది, మరో మూడు రోజుల్లో ఎన్నికల టికెట్లపై ఎమ్మెల్యేలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఈ ముగ్గురు భేటీ అవ్వడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి మధ్య ఎన్నికలపైనే మంతనాలు జరిగినట్లుగా కూడా సమాచారం. వీరు రాష్ట్రంలో, జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా సమాచారం.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో పది స్థానాలు వైసిపినే గెలుచుకుంటుందని అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరులోని 10 అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని తెలిపారు. జగన్ ని మరోసారి   ముఖ్యమంత్రి చేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వచ్చే వంద రోజుల్లో నేతల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను సర్దుకుని.. అందరం కూర్చుని, మాట్లాడుకుని, కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. వీరు చెబుతుంది సరే.. జగన్ ఏమనుకుంటున్నాడు. వీరిమీద వేటు పడబోతుందా? టికెట్ దక్కుతుందా? అనే విషయం తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

click me!