చంద్రబాబుకు షర్మిల గిప్ట్ ... అన్న జగన్ కు రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకేనా? 

Published : Dec 25, 2023, 09:07 AM ISTUpdated : Dec 25, 2023, 09:28 AM IST
చంద్రబాబుకు షర్మిల గిప్ట్ ... అన్న జగన్ కు రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకేనా? 

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లోనూ వైఎస్ షర్మిల మద్దతును కాంగ్రెస్ కోరుతున్నట్లు సమాచారం. అవసరం అయితే షర్మిలనే ముందుంచి ఏపీ అసెంబ్లీ బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోందట. 

అమరావతి : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుల మధ్య ఆస్తుల కోసం విబేధాలు తలెత్తినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత చెల్లి వైఎస్ షర్మిలకు అన్యాయం చేస్తున్నాడట... అందువల్లే ఆమె అన్నకు దూరంగా వుంటోందట. గతంలో వైఎస్ జగన్ జైల్లో వుండగా ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలకంగా వ్యవహరించారు... అన్నకు మద్దతుగా నిలిచి పాదయాత్ర కూడా చేసారు. కానీ వైసిపి అధికారంలోకి వచ్చాక షర్మిలను జగన్ పట్టించుకోకపోగా తండ్రి ఆస్తులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారట. దీంతో చేసేదేమిలేక ఆంధ్ర పాలిటిక్స్ కు, వైఎస్ జగన్ కుటుంబానికి దూరంగా వుంటూ తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టారు షర్మిల. 

అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించడంలో షర్మిల సహకరించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వుండేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు... కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దీంతో వైఎస్సార్ టిపి శ్రేణులే కాదు ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. ఇలా  తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవడంతో తనవంతు పాత్ర పోషించారు వైఎస్ షర్మిల.   

తెలంగాణలో షర్మిలను కలుపుకుపోవడంతో మంచి పలితాలు వచ్చాయి... ఇదే వ్యూహాన్ని ఏపీలో ఉపయోగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా షర్మిలను ముందుపెట్టాలన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వైఎస్ జగన్ ను ఓడించేందుకు ఆయన చెల్లి షర్మిలను అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Also Read  ఓ పీకే వుండగా మరో పీకే ఎందుకు? పవన్ పాలిటిక్స్ తో పవర్ కష్టమేనా? : మాజీ సీఎస్ ఐవైఆర్

వైఎస్ షర్మిల తీరు చూస్తుంటే నిజంగానే ఆమె అన్న వైఎస్ జగన్ వ్యతిరేకంగా రాజకీయా చేసేందుకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గరయ్యారు షర్మిల. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆమె యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ పండగవేళ వైఎస్ జగన్ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి గిప్ట్ పంపించారు. ఇలా నారా కుటుంబానికి క్రిస్మస్ గిప్ట్ ఇచ్చి అన్న జగన్ కు రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకు వైఎస్ షర్మిల సిద్దమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

 

ఇక వైసిపిని ఎట్టిపరిస్థితుల్లో గద్దె దించాలన్న పట్టుదలతో వున్న టిడిపి కూడా వైఎస్ షర్మిలతో రాజకీయంగా దగ్గరయ్యేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరేందుకు కూడా టిడిపి ప్రయత్నిస్తోందట... ఈ విషయంపై చర్చించేందుకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయినట్లు మరో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే  ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారంటూ ప్రచారం జరుగుతున్న వైఎస్ షర్మిలకు దగ్గరయ్యేందుకు టిడిపి నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగమే నారా కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిప్ట్ ... బదులుగా లోకేష్ ఆమెకు పండగ శుభాకాంక్షలు, థ్యాంక్స్ చెప్పారట.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే