చంద్రబాబు సీనియారిటీ..కొన్ని నిజాలు

First Published Apr 5, 2018, 2:13 PM IST
Highlights
ఇదే విషయమై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చంద్రబాబుపై గతంలోనే ఫైర్ అయ్యారు.

కొద్దిరోజుల క్రితం చంద్రబాబునాయుడు చేసిన ‘సీనియారిటీ’ ప్రకటనపై జనాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఓ సమాచారం సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దేశం మొత్తం మీద తనకన్నా సీనియర్ రాజకీయ నాయకుడు లేరని, తానే అందరికన్నా సీనియర్ అని ఈమధ్య చంద్రబాబు చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇదే విషయమై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చంద్రబాబుపై గతంలోనే ఫైర్ అయ్యారు. సిఎంగానే కాకుండా కనీసం టిడిపిలో కూడా చంద్రబాబుకు సీనియారిటీ లేదన్నారు. దేశంలో తీసుకుంటే చంద్రబాబుకన్నా సీనీయర్ నేతలు చాలామందే ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబుకన్నా సీనియార్లైన కొందరు నేతల వివరాలు మీరే చూడండి.

సీనియర్ మోస్ట్ నేతలు, సిఎంలు కూడా

జ్యోతి బసు-పశ్చిమబంగ - 23 ఏళ్ళు 4 నెలలు

పవన్ కుమార్-సిక్కిం-23 ఏళ్ళు 3 నెలలు (28 April 2018 న జ్యోతి బసు ని దాటేస్తారు)

గెగోంగ్ అపాంగ్-22 ఏళ్ళు 8 నెలలు

లాల్ తణ్హావాలా-మిజోరాం-21 ఏళ్ళు 5 నెలలు

వీరభద్ర సింగ్-హిమాచల్ ప్రదేశ్-21 ఏళ్ళు

మాణిక్ సర్కార్-త్రిపుర-19 ఏళ్ళు 11 నెలలు

ప్రకాష్ సింగ్ బాదల్-పంజాబ్-18 ఏళ్ళు 11 నెలలు 

కరుణానిధి-తమిళనాడు-18 ఏళ్ళు 9 నెలలు

యస్వంత్ సింగ్ పర్మార్-హిమాచల్ ప్రదేశ్-18 ఏళ్ళు 3 నెలలు

నవీన్ పట్నాయక్-ఒడిశా-18 ఏళ్ళు 1 నెల*

మోహన్లాల్ సుఖాడియా-రాజస్థాన్-17 ఏళ్ళు 6 నెలలు

సేనయంగ్బా చుబాతోషి జమీర్-నాగాలాండ్-15 ఏళ్ళు 5 నెలలు

షీలా దీక్షిత్-ఢిల్లీ-15 ఏళ్ళు 1 నెల

తరుణ్ గొగోయ్-అస్సాం-15 ఏళ్ళు

చంద్రబాబు నాయుడు-దాదాపు 13 ఏళ్ళు*

 

click me!