అచ్చెన్నాయుడు అందుకే హీరో: జగన్ పై బాబు ఫైర్

Published : Feb 16, 2021, 03:45 PM IST
అచ్చెన్నాయుడు  అందుకే హీరో: జగన్ పై బాబు ఫైర్

సారాంశం

అచ్చెన్నాయుడును చూస్తే వైసీపీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని... అందుకే ఆయనను అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.

విశాఖపట్టణం: అచ్చెన్నాయుడును చూస్తే వైసీపీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని... అందుకే ఆయనను అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కిమ్స్ ఆసుపత్రిలో చంద్రబాబునాయుడు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.అచ్చెన్నాయుడును మొన్న కూడా అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చేయాలని ఆయన సవాల్ విసిరారు.

ఇంకో సారి అరెస్ట్ చేస్తే ఇంకా కొంచెం ఆయన ఆరోగ్యంగా తయారౌతారన్నారు. నీ మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకొని జైలుకు వెళ్లలేదన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తూ అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లాడని చంద్రబాబు ప్రశంసించారు.

స్వార్థం కోసం కానీ, తప్పు చేసి కానీ అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లలేదన్నారు. పోరాటం చేసిన వారు ఎప్పటికైనా హీరోలే అవుతారన్నారు. జీరోలు ఎప్పుడు కారని ఆయన చెప్పారు.ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు. 

పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకొని నిమ్మాదలో వైసీపీ అభ్యర్ధిని బెదిరించారనే కేసులో అరెస్టై ఇటీవలనే బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu