జగన్ పబ్ జీ ఆడుతున్నాడా?: విశాఖలో చంద్రబాబు

Published : Feb 16, 2021, 03:27 PM IST
జగన్ పబ్ జీ ఆడుతున్నాడా?: విశాఖలో చంద్రబాబు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోంటే  జగన్ పబ్ జీ ఆడుతున్నాడా అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


 

విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోంటే  జగన్ పబ్ జీ ఆడుతున్నాడా అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖపట్టణంలోని కిమ్స్ ఆసుపత్రిలో గాజువాక మాజీ ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాసరావును చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.స్టీల్ ప్లాంట్ విశాఖ పట్టణం ఆత్మగా ఆయన అభివర్ణించారు. విశాఖ ఆత్మను దోచుకోవాలనుకొంటున్నారని ఆయన వైసీపీపై మండిపడ్డారు. జగన్ ఎక్కడున్నావ్ పబ్ జీ ఆడుకొంటున్నావా అని ఆయన ప్రశ్నించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోంటే  రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలన్నారు. విశాఖను దోచుకోవాలనుకొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎందరో త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెట్ గురించి మీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో రెండేళ్లలో జగన్ సర్కార్ ఏం చేసిందని ఆయన అడిగారు.విశాఖ స్టీల్ సిటీని స్టోలేన్ సిటీగా మారిస్తే ఊరుకొంటారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు ఊపిరి పోశారని ఆయన చెప్పారు.మోసం చేసే మాటలు మానుకోవాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!