కుప్పం నుండే ధర్మపోరాటం: జగన్ మీద చంద్రబాబు నిప్పులు

By narsimha lodeFirst Published Aug 25, 2022, 12:18 PM IST
Highlights

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. కుప్పం నుండే ధర్మపోరాటం ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 

కుప్పం:కుప్పం నుండే ధర్మపోరాటం చేస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారం నాడు అన్న క్యాంటీన్ వద్ద నిరసన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రసంగించారు.ఇవాళ కుప్పంలో చీకటి రోజుగా చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పంలో చోటు చేసుకున్న ఘటనలు చూస్తే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు. దాడులు,దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. నాపైనే దాడికి దిగుతున్నారు, మీరో లెక్కా అని ప్రజలను చంద్రబాబు అడిగారు.

తప్పు చేసిన పోలీసులను  వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు ప్రకటించారు..పోలీసుల  గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. అయితే కొందరు పోలీసుల తీరును చంద్రబాబు తప్పు బట్టారు. ఇంత జరుగుతున్న మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావని చంద్రబాబు ప్రశ్నించారు.సీఎం చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారన్నారు.;పోలీస్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను గాడిలో పెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు పోలీసులు తమ ఉద్యోగాలను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో పనిచేసిన డీజీపీ చేసిన వ్యాఖ్యలను  కూడా చంద్రబాబు ప్రస్తావించారు.  ఈ డీజీపీ ప్రస్తుతం చరిత్ర హీనుడైపోయారన్నారు.ధర్మం గెలిచే వరకు ప్రజా పోరాటం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలోనే ఉంటాను... దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని చంద్రబాబు సవాల్ విసిరారు. 

కుప్పంలో ఎప్పుడైనా  రౌడీయిజం చూశారా అని చంద్రబాబు ప్రశ్నించారు కానీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వీధికో రౌడీని తయారు చేసిందన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఖబడ్దార్ జగన్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. . 

తమ పార్టీ చేపట్టిన బాదుడే బాదుడే కార్యక్రమానికి వచ్చే ఆదరణను చూసి తట్టుకోలేక వైసీపీ సర్కార్ పిచ్చి నాటకాలు చేస్తుందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎందరో సీఎంలను చూశానన్నారు.కానీ జగన్ లాంటి నీచుడిని ఇంతవరకు చూడలేదని చంద్రబాబు విమర్శించారు. గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ టీడీపీ అనే విషయాన్ని  చంద్రబాబు గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తీసుకున్న చర్యలను ప్రస్తావించారు.అక్రమ కేసులకు తాము భయపడబోమన్నారు.

కుప్పంలో చోటు చేసుకున్న ఘటనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తాను బతికి ఉన్నంతవరకు మీరేమీ చేయలేరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.అన్న క్యాంటీన్ ను ఇక్కడే ప్రారంభిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్ ను ఎవరు అడ్డుకొంటారో అడ్డుకోవాలని చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు చెప్పారు.. పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి వచ్చినా సమాధానం చెబుతానన్నారు.  మా వద్ద 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ధైర్యం ఉంటే జగన్ రెడ్డి నువ్వు రా అని సవాల్ విసిరారు. చోటా మోటా నాయకులు కాదు దమ్ముంటే జగన్ రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి రావాలని చంద్రబాబు కోరారు. బాంబు దాడులకే భయపడలేదు, మీ అరాచకాలకు భయపడుతానా అని చంద్రబాబు ప్రశ్నించారు.ప్రజా వ్యతిరేక  విధానాలు తట్టుకోలేక మా పై దాడులు చేస్తున్నారన్నారు. 


 

 


 

click me!