కుప్పంలో టెన్షన్ వాతావరణం.. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన.. అన్న క్యాంటీన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

Published : Aug 25, 2022, 11:02 AM ISTUpdated : Aug 25, 2022, 11:20 AM IST
కుప్పంలో టెన్షన్ వాతావరణం.. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన.. అన్న క్యాంటీన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన చేపట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కుప్పంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన వైసీపీ శ్రేణులు.. పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. 

చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన చేపట్టాల్సి ఉంది. అయితే అయితే చంద్రబాబు టూర్ ను అడ్డుకొంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఇరు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా నిరసనలకు సిద్దమవ్వడంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

అయితే కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన వైసీపీ శ్రేణులు.. పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. వైసీపీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ప్యాలెస్ రోడ్డులో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్న అన్న క్యాంటీన్‌ వద్ద ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు.

అన్న క్యాంటీన్ వద్దకు భారీగా చేరుకుని.. ఈలలు, కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే వైసీపీ కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ.. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో చేతులేత్తేశారు. వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. అయితే వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్న  అడ్డుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక, వైసీపీ నిరసన దృష్ట్యా చంద్రబాబు పర్యటన కొనసాగుతుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్