కేసీఆర్ సర్కార్ పై జగన్ నమ్మకం అదే: బాబు

By narsimha lodeFirst Published Feb 12, 2019, 1:54 PM IST
Highlights

గన్ తాను చేసే పనులను ఇతరులు  కూడు ఆ పనిని చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మూటలు ఇస్తాయని జగన్‌ విశ్వాసంతో ఉన్నారని ఆయన ఆరోపించారు.


న్యూఢిల్లీ: జగన్ తాను చేసే పనులను ఇతరులు  కూడు ఆ పనిని చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మూటలు ఇస్తాయని జగన్‌ విశ్వాసంతో ఉన్నారని ఆయన ఆరోపించారు.

అనంతపురంలో జరిగిన వైసీపీ శంఖారావం సభలో ఓటుకు  బాబు రూ5 వేలు ఇస్తాడని జగన్ చేసిన ఆరోపణలపై చంద్రబాబునాయుడు స్పందించారు. తప్పుడు పనులు చేసే అలవాటు, చరిత్ర జగన్‌కు ఉందన్నారు. ఆ తరహా పద్దతులు, పనులు తనకు తెలియవన్నారు.

మంగళవారం నాడు రాష్ట్రపతిని కలిసిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  తమ దీక్షకు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాస్తే,  దానికి వైసీపీ మద్దతిస్తోందన్నారు.

బీజేపీకి మద్దతుగా  వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ నేతలు కలిసి పోటీ చేయాలని  బాబు కోరారు.మోడీ  గుంటూరుకు వస్తే  ప్రోటోకాల్ పాటించడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేయడాన్ని బాబు తప్పుబట్టారు.

ప్రధానమంత్రి గుంటూరుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్‌ వెళ్లారని ఆయన గుర్తు చేశారు.ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తే ప్రధానమంత్రి గుంటూరుకు వస్తే  వెళ్లాలా... వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే  ఏమయ్యేదని బాబు ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలతో కలిసి రాజీనామాలు చేస్తే కుక్క తోక పట్టుకొని గోదారి దాటినట్టేనని ఆయనచెప్పారు. 

మేం రాజీనామాలు చేస్తే ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అంశాలను ఎవరు పార్లమెంట్‌లో  ప్రస్తావించే వారేనని ఆయన చెప్పారు.టీడీపీ ఎప్పుడూ కూడ సామాజిక న్యాయాన్ని నమ్ముతోందన్నారు. 

తాను  విద్యార్థి దశ నుండి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.  ఏపీలో ఒకే కులానికి పెద్ద పీట వేసినట్టు జగన్ తప్పుడు ప్రచారం  చేశారని బాబు విమర్శించారు. ఒకే కులానికి పెద్ద పీట వేసినట్టు జగన్ నిరూపిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను పట్టించుకోలేదు: రాష్ట్రపతికి బాబు ఫిర్యాదు

ఏపీ మొత్తం ఢిల్లీ వీధుల్లో...: పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు

click me!