టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

By narsimha lodeFirst Published Dec 19, 2018, 5:08 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. 

అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. గత ఎన్నికల్లో కూడ ఇదే రకరమైన నిర్ణయం తీసుకొన్నారు కానీ, ఆచరణలో  అది సాధ్యం కాలేదు. ఈ దఫానైనా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది.

గత ఎన్నికలకు ముందు కూడ పోటీ లేని స్థానాలను ముందుగానే ప్రకటించాలని చంద్రబాబునాయుడు భావించారు. కానీ కొన్ని కారణాలతో అభ్యర్థుల ప్రకటన ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే వెలువడింది.

ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీలో  ఎన్నికలు  జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఎన్నికలు ముందుగా ఎన్నికలు జరిగే  అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో  అభ్యర్థులను ముందుగానే  ప్రకటించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

అయితే  ఏ అసెంబ్లీ నియోజకర్గంలో  ఏ అభ్యర్థిని బరిలోకి దింపితే విజయావకాశాలు మెండుగా ఉంటాయనే విషయమై చంద్రబాబునాయుడు సర్వే నిర్వహిస్తున్నారు.ఈ సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పలు సర్వే రిపోర్ట్‌ల ఆధారంగా చంద్రబాబునాయుడు అభ్యర్థులను ప్రకటించనున్నారు.  

శాసనసభ ఎన్నికల్లో  పోటీ చేసే  అభ్యర్థులను ముందుగా  ప్రకటించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని  టీడీపీ నాయకత్వం భావిస్తోంది.అయితే  గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహిస్తున్నారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన టెలి కాన్పరెన్స్‌లో  ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు బాబు పార్టీ నేతలకు చెప్పారు.ఈ నాలుగున్నర ఏళ్లలో  టీడీపీ చేపట్టిన  అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని బాబు పార్టీ శ్రేణులను కోరారు.


 

click me!