
వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. గిఫ్ట్ అంటే ఏ కారో లేకపోతే ఇంకోటో అనుకోవద్దు. నిరంతరం కత్తులు దూసుకునే ప్రత్యర్ధుల నుండి శుభాకాంక్షలు అందింది. అది కూడా ఎవరి వద్ద నుండి అనుకుంటున్నారు ? ఇంకెవరు చంద్రబాబునాయుడు నుండే కావటం విశేషం. జగన్ గురువారం 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. నల్లమాడ మండలంలో అభిమానులు పెద్ద కేక్ తయారు చేయించారు జగన్ కోసం. వైసిపి నేతలు, అభిమానులందూ జగన్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అటువంటి సమయంలో ఊహించని రీతిలో ముఖ్యమంత్రి నుండి కూడా జగన్ కు శుబాకాంక్షలు అందాయి.
జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ‘సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలం’టూ చంద్రబాబు ట్విట్టర్లో గ్రీటింగ్స్ పంపారు. రాజకీయాలు ఎలాగున్నా కనీసం ఇటువంటి సందర్భాల్లో అయినా ఒకరికి మరొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం మంచి సంప్రదాయమే కదా ?
దానికి తగ్గట్లే వైఎస్ జగన్ కూడా స్పందించారు. ‘ ప్లెసంట్ సర్ ప్రైజ్ అండి థాంక్యూ’ అని హుందాగా ట్వీట్ చేశారు.