చంద్రబాబుకు కోర్టు షాక్

First Published Dec 21, 2017, 4:46 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు కోర్టు షాక్ ఇచ్చింది.

చంద్రబాబునాయుడుకు కోర్టు షాక్ ఇచ్చింది. రాజధాని గ్రామాల పరిధిలోని కురగల్లులో భూ సేకరణను నిలిపేయాలంటూ కోర్టు ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందంటూ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ గురువారం విచారణకు వచ్చింది. విచారణలో భూసేకరణ నోటిఫికేష్ ను సమర్ధించుకుంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం పోవాల్సిందేనంటూ గట్టిగా హెచ్చరించింది. అంతేకాకుండా భూసేకరణ ప్ర్రక్రియను తక్షణమే నిలిపేయాల్సిందిగా ఆదేశించింది.

రాజధాని ప్రాతంలోని కొన్ని గ్రామాల్లోని రైతులు ప్రభుత్వానికి తమ భూములను ఇవ్వటానికి నిరాకరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, బలవంతంగా అయినా సరే, రైతుల భూములను తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించారు. దాంతో రాజధాని నిర్మాణానికి సహకరించని గ్రామాల రైతులను ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవలే ఓ రైతుకు చెందిన మల్లె తోటను అధికారులు ధ్వంసం చేసారు. రైతు గట్టిగా ప్రతిఘటిస్తే వెనక్కుతగ్గారు. ఇలా ఎక్కడో ఒకచోట రైతులను ప్రభుత్వాధికారులు వేధిస్తూనే ఉన్నారు. దాంతో రైతులు కూడా ప్రభుత్వానికి ఎక్కడికక్కడ ఎదురుతిరుగుతూనే ఉన్నారు. అటువంటి రైతులకు వైసిపి మద్దతుగా నిలిచింది. రైతుల తరపునే ఆళ్ళ న్యాయస్ధానంలో పోరాటం చేస్తున్నారు.

click me!