ఐదుకోట్ల తెలుగు ప్రజల వాణిని పార్లమెంట్‌లో విన్పించండి: బాబు

Published : Jul 19, 2018, 12:00 PM IST
ఐదుకోట్ల తెలుగు ప్రజల వాణిని పార్లమెంట్‌లో విన్పించండి: బాబు

సారాంశం

కేంద్రంపై అవిశ్వాసం చర్చ సందర్భంగా  ఐదు కోట్ల తెలుగు ప్రజల గొంతును పార్లమెంట్‌లో విన్పించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు.


అమరావతి: కేంద్రంపై అవిశ్వాసం చర్చ సందర్భంగా  ఐదు కోట్ల తెలుగు ప్రజల గొంతును పార్లమెంట్‌లో విన్పించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు.

గురువారం నాడు చంద్రబాబునాయుడు  టీడీపీ ఎంపీలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.అవిశ్వాసానికి  అన్ని పార్టీల మద్దతును కోరాలని ఆయన టీడీపీ ఎంపీలను కోరారు. ఇదొక చారిత్రక అవసరమని చంద్రబాబునాయుడు  పార్టీ ఎంపీలకు సూచించారు.

అవిశ్వాసానికి మద్దతివ్వాలని అన్ని పార్టీలను కోరాలని  చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. ఒకవేళ మద్దతివ్వని పార్టీలను తటస్థంగా ఉండాలని  కోరాలని బాబు ఆ పార్టీలను కోరాలని  ఆదేశించారు.

అవిశ్వాసంపై  సుమారు 7 గంటలకు పైగా చర్చ జరిగే అవకాశం ఉందని  చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు చెప్పారు.  అయితే  అవిశ్వాసంపై  చర్చ సందర్భంగా టీడీపీకి 15 నిమిషాలు సమయం దక్కే అవకాశం ఉందని బాబు చెప్పారు.

అయితే  ఏపీ రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమయం అడగాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు.  చారిత్రక అవసరంగా దీన్ని భావించాలని ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. 

కేంద్రం తీరును పార్లమెంట్‌ వేదికగా ఎండగట్టాలని బాబు టీడీపీ ఎంపీలను కోరారు. అదే సమయంలో ఏపీ ప్రజల గొంతును పార్లమెంట్ వేదికగా విన్పించాలని ఆయన సూచించారు.


 

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu