అవిశ్వాసంతో జగన్‌కు ఊపిరి ఆడటం లేదు.. ఆయనకు సొంతజిల్లా ఏమైనా పర్లేదు: యనమల

First Published Jul 19, 2018, 11:59 AM IST
Highlights

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌పై తాము అవిశ్వాసం ప్రవేశపెట్టడం.. దానిని స్పీకర్ అనుమతించడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని.. తాజా  పరిణామాలతో జగన్‌కు ఊపిరి ఆడటం లేదని వ్యాఖ్యానించారు

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌పై తాము అవిశ్వాసం ప్రవేశపెట్టడం.. దానిని స్పీకర్ అనుమతించడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని.. తాజా  పరిణామాలతో జగన్‌కు ఊపిరి ఆడటం లేదని వ్యాఖ్యానించారు.. అవిశ్వాసంలో పాల్గొనకుండా వైసీపీ ఎంపీలు బీజేపీ సహకారంతో ఆడిన డ్రామా ఈ దెబ్బతో బయటపడిందన్నారు..

ప్రత్యేకహోదా, ఇతర అంశాలపై ప్రతిపక్షనేతకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. జగన్ దృష్టి కేవలం కేసుల నుంచి బయటపడటంపైనే ఉందని.. మోడీ, అమిత్ షాల డైరెక్షన్‌లో వైసీపీ పనిచేస్తోందన్నారు.. వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ అవనీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌పై జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. అలాగే రాజస్థాన్‌లోని పెట్రో కాంప్లెక్స్‌పై ఉన్న శ్రద్ద.. కాకినాడ కాంప్లెక్స్‌పై లేదని ప్రధానిపై మండిపడ్డారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ కన్నా ఎక్కువగా ఢిల్లీ-ముంబై కారిడార్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో నిలదీయాలని జగన్‌ను డిమాండ్ చేశారు..

సొంతజిల్లాలో స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షనేతకు ఏ మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సొంతజిల్లాకే న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి న్యాయం చేయగలడా అని ప్రశ్నించారు.. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడలేదని యనమల విమర్శించారు.
 

click me!