కరోనాపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం: చంద్రబాబు

By narsimha lodeFirst Published May 5, 2021, 4:54 PM IST
Highlights

వ్యాక్సినేషన్ పై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

అమరావతి: వ్యాక్సినేషన్ పై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.బుధవారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు.వ్యాక్సినేషన్ రెండు డోసులు వేసుకొంటే ఈ వైరస్ వ్యాప్తి చాలా తగ్గుతోందన్నారు. అమెరికాలో కేసుల వ్యాప్తి తగ్గడానికి ఆ దేశంలో 60 నుండి 70 వ్యాక్సినేషన్ కూడ కారణంగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఏపీ రాష్ట్రంలో ఆక్సిజన్, బెడ్స్ కొరత ఉందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కపెడుతోందన్నారు. కరోనాను కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శంచారు. ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. 

కరోనా సోకిన కుటుంబాలకు తమ పార్టీ తరపున సహాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం ద్వారా కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాలని ఆయన కోరారు.  రాష్ట్రంలో వ్యాక్సిన్లను ఎందుకు రిజర్వ్ చేసుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ద్వారా 190 మందికి చికిత్స అందించినట్టుగా చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువమందికి ఎలా వైద్య సహాయం అందించాలనే విషయమై తమ పార్టీలో చర్చించనున్నట్టుగా చెప్పారు. తమ పార్టీ కరోనా విషయమై రోజు రెండు నుండి మూడు గంటల పాటు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. సీఎం ఈ విషయమై కేంద్రీకరించాలని  ఆయన సూచించారు. 


 

click me!