జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 5:00 PM IST
Highlights

పీఎంఏవై-ఎన్​టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. 

అమరావతి: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు చెల్లవంటూ... వారిని అనర్హులుగా ప్రకటిస్తూ వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.

పీఎంఏవై-ఎన్​టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనతో ఇళ్లపట్టాలు పొందలేకపోయిన కొంతమంది మంగళగిరి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. 

read more  ఏపీలో పరిషత్ ఎన్నికలు: సింగిల్ జడ్జి ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే

ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం బాధితుల తరపు వాదనలు విని ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. చిన్నచిన్న కారణాలు చూపి అనర్హులుగా ప్రకటించడమేంటని జగన్ సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది.
 

click me!