కుట్రే: వైఎస్ షర్మిల ఇష్యూపై చంద్రబాబు మాట

Published : Jan 21, 2019, 01:59 PM IST
కుట్రే: వైఎస్ షర్మిల ఇష్యూపై చంద్రబాబు మాట

సారాంశం

వృద్ధులకు పింఛన్ నెలకు రూ.2000 పెంచిన సందర్భంలో అది ప్రజలకు చేరకుండా ఉండేందుకు పక్కదారి పట్టించేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. 

అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, సినీనటుడు ప్రభాస్ లపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు షర్మిల అంశంపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరకుండా ఉండేందుకు వైసీపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

వృద్ధులకు పింఛన్ నెలకు రూ.2000 పెంచిన సందర్భంలో అది ప్రజలకు చేరకుండా ఉండేందుకు పక్కదారి పట్టించేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం తమపై నెట్టే ప్రయత్నం కచ్చితంగా కుట్రేనని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్