ఎపి పర్యటనకు కౌంటర్: గడ్కరీకి చంద్రబాబు లేఖ

Published : Jan 21, 2019, 01:48 PM IST
ఎపి పర్యటనకు కౌంటర్: గడ్కరీకి చంద్రబాబు లేఖ

సారాంశం

నితిన్ గడ్కరీ ప్రసంగం పూర్తైన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు పేజీల లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ 2ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ 2కు సంబంధించి ఎందుకు నిధులు విడుదల చెయ్యడం లేదో చెప్పాలని చంద్రబాబు నాయుడు లేఖలో డిమాండ్ చేశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరుపార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఏపీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తుంటే అదే నితిన్ గడ్కరీకి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

ఏపీలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలోని పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లు ఏపీకి స్వర్ణయుగమని చెప్పుకొచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించిన ప్రతీ పైసా కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఘనత బీజేపీదేనని గడ్కరీ ప్రకటించారు.

నితిన్ గడ్కరీ ప్రసంగం పూర్తైన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు పేజీల లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ 2ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ 2కు సంబంధించి ఎందుకు నిధులు విడుదల చెయ్యడం లేదో చెప్పాలని చంద్రబాబు నాయుడు లేఖలో డిమాండ్ చేశారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇస్తామన్న హమీని తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహకరించకపోయినా ఇప్పటి వరకు 64 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామన్న హామీకి సంబంధించి నిధులు విడుదల చెయ్యాలని లేఖలో కోరారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్