చదువుకున్న వారు పిల్లల్ని కనడానికి ఇష్టపడరా?

Published : Sep 05, 2017, 04:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
చదువుకున్న వారు పిల్లల్ని కనడానికి ఇష్టపడరా?

సారాంశం

బాగా చదువుకున్న వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పిల్లల్ని కనడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. పిల్లల్ని కనడం, పెంచటాన్ని చదువుకున్న వారు శ్రమగా భావిస్తున్నారని బోల్డ్ బాధపడిపోయారు. ఇది సరైన పద్దతి కాదని కుడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఓ ఉచిత సలహా కుడా పడేసారు లేండి

‘బాగా చదువుకున్న వారు పిల్లల్ని కనబడటానికి ఇష్టపడటం లేదు’ ఇది చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. మంగళవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన టీచర్స్ డే ఫంక్షన్లో మాట్లాడుతూ, బాగా చదువుకున్న వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పిల్లల్ని కనడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ‘కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా’ అంటూ ఓ సామెతను చెప్పటం అప్పట్లో సంచలనమైంది.

ఇపుడు విషయానికి వస్తే పిల్లల్ని కనడం, పెంచటాన్ని చదువుకున్న వారు శ్రమగా భావిస్తున్నారని తెగ బాధపడిపోయారు. ఇది సరైన పద్దతి కాదని కుడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఓ ఉచిత సలహా కుడా పడేసారు లేండి. ‘ఒకపుడు కుటుంబ నియంత్రణను తానే ప్రోత్సహించానని, కానీ ఇపుడు పిల్లలను కనాలని కుడా తానే చెబుతున్నాను’ అని చెప్పటం గమనార్హం. లేకపోతే రోబోలతో పనులు చేయించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్