స్టీల్ ప్లాంట్ ముసుగులో 2 లక్షల కోట్ల స్కామ్‌కి స్కెచ్: శైలజానాథ్ సంచలనం

By Siva KodatiFirst Published Feb 16, 2021, 3:25 PM IST
Highlights

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఏడాది క్రితమే చీకటి ఒప్పందం కుదిరిందంటూ ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల కుంభకోణానికి ప్రణాళికలు రూపొందించారంటూ శైలజా నాథ్ వ్యాఖ్యానించారు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఏడాది క్రితమే చీకటి ఒప్పందం కుదిరిందంటూ ఆరోపించారు.

రూ. 2 లక్షల కోట్ల కుంభకోణానికి ప్రణాళికలు రూపొందించారంటూ శైలజా నాథ్ వ్యాఖ్యానించారు. ఎంపీలు చేతగాని వాళ్లుగా మారిపోయారని.. రిమోట్ సీఎం దగ్గర పెట్టుకుని ఆయన లేఖల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ మండిపడ్డారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. పోస్కోతో సంప్రదింపులు నిజం కాదా అని శైలాజా నాథ్ నిలదీశారు.

విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చడం కోసమే.. మున్సిపల్ ఎన్నికలు తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉక్కు పరిరక్షణ ఉద్యమం చేపడతామని శైలజానాథ్ స్పష్టం చేశారు. 

click me!