కారణమిదీ: సీఐడీ నోటీసులు, ఏలూరుకి వెళ్తున్న బాబు

By narsimha lode  |  First Published Mar 17, 2021, 1:00 PM IST

అమరావతిలో అసైన్డ్ భూముల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే  ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు అందుకొన్న తర్వాత చంద్రబాబునాయుడు తొలిసారిగా ఏపీకి వచ్చారు.
 


అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే  ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు అందుకొన్న తర్వాత చంద్రబాబునాయుడు తొలిసారిగా ఏపీకి వచ్చారు.

ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ చేయడం ద్వారానే అక్రమాలు చోటు చేసుకొన్నాయని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

Latest Videos

ఈ విషయమై గత మాసంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబునాయుడితో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడ నోటీసులు ఇచ్చారు.

ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు  తనయుడు రాంజీ ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో చంద్రబాబునాయుడు మాగంటి బాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మాగంటి బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన తర్వాత అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది.


 

click me!