మూతబడిన స్కూల్‌ను ఇంటిగా మార్చేసుకున్న వైసీపీ నేత!.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు..

Published : Sep 10, 2022, 11:57 AM IST
మూతబడిన స్కూల్‌ను ఇంటిగా మార్చేసుకున్న వైసీపీ నేత!.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు..

సారాంశం

మూతబడిన స్కూల్‌ను ఓ వైసీపీ నేతగా ఇంటిగా మార్చేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని పాణ్యం ఇందిరానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌ను అక్రమించుకున్న ఆ వైసీపీ నేత తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూతబడిన స్కూల్‌ను ఓ వైసీపీ నేతగా ఇంటిగా మార్చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాణ్యం ఇందిరానగర్‌‌లో చెంచు గిరిజన్ల కోసం 2013లో రాజీవ్‌ విద్యా మిషన్‌ నిధులతో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. అయితే విద్యార్థుల కొరతతో ఐదేళ్ల క్రితం పాఠశాల మూతబడింది. అయితే స్కూల్ మూతబడి ఉండటాన్ని గమనించిన ఓ వైసీపీ నేత దానిని అక్రమించుకున్నారు. 

స్కూల్ శిలఫలకాన్ని తొలగించి, రంగు మార్చేశారు. మెట్లు కూడ నిర్మించారు. ఇక, తరగతి గదుల్లోని బ్లాక్ బోర్డును తొలగించి.. వంట రూమ్, బెడ్ రూమ్‌గా మార్చేసుకున్నాడు. మొత్తంగా స్కూల్ రూపురేఖలు మార్చేసి ఇంటిగా మార్చుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తమకు తెలియదని.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu