తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు... చంద్రబాబు ఏమన్నారంటే..?

Published : Jun 02, 2024, 05:51 PM ISTUpdated : Jun 02, 2024, 10:01 PM IST
తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు... చంద్రబాబు ఏమన్నారంటే..?

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి పదేళ్లయింది. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధిపై కీలక పోస్టు చేశారు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి పదేళ్లయింది. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధిపై కీలక పోస్టు చేశారు...

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. 2014 జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ''రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి.... సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను'' అని చంద్రబాబు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu