మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు.ఈ అరెస్ట్ ను కక్షపూరితమైందిగా ఆయన పేర్కొన్నారు.
అమరావతి:మాజీ మంత్రి అరెస్ట్ ను TDP చీఫ్ చంద్రబాబునాయుడు ఖండించారు. Tenth పేపర్ల leakage విషయమై నారాయణను మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు స్పందించారు.
నారాయణ అరెస్ట్ కక్షపూరితమైందిగా ఆయన పేర్కొన్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణ వైఫల్యాన్నీ కప్పిపుచ్చేందుకు నారాయణను అరెస్ట్ చేశారని Chandrababu Naidu ఆరోపించారు.
మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను బాధ్యులను ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ముందస్తు నోటీసు లేకుండా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య కాదా అని ఆయన ప్రశ్నించారు.YCP అధికారంలోకి వచ్చినప్పటి నుండి నారాయణపై కక్ష కట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి తెలుగు ప్రశ్నపత్రం లీకైంది.చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల నుండి ఈ పేపర్ లీకైందని పోలీసులు గుర్తించారు. గత నెల 27 చిత్తూరు జిల్లా డీఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో భాగంగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
చిత్తూరులోని నారాయణ స్కూల్ నుండి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విసయమై చిత్తూరు డీఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు గత నెల 27న కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో టెన్త్ క్లాసులో పేపర్ల లీకేజీ తో పాటు మాల్ ప్రాక్టీస్ విసయమై ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో నారాయణ స్కూల్స్ కు చెందిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ తో పాటు ఆ విద్యా సంస్థలకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.మరో వైపు ఇవాళ ఉదయం హైద్రాబాద్ లో నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
నారాయణ స్కూల్స్ తో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుండి కూడా పేపర్లు లీకయ్యాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పేపర్ల లీకేజీ వెనుక టీడీపీ నేతలే ఉన్నారని జగన్ ఆరోపించారు. పైగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేసేందుకు టీడీపీ నేతలు పేపర్లను లీక్ చేశారని ఆరోపించారు. అంతేకాదు పైగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అయితే దీనికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. విద్యార్ధుల పరీక్ష పేపర్లు లీక్ కావాలని ఎవరైనా కోరుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. పేపర్లు లీక్ కావాలని ఎవరైనా కోరుకొంటారా అని ప్రశ్నించారు. ఏపీలో పేపర్ల లీకేజ్ ఘటనకు సంబంధించి ఏపీలో సుమారు 50 మందికి పైగా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్తూరు పోలీసులు ప్రకటించారు.ఈ ిషయమై చిత్తూరు ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
చిత్తూరులోని నారాయణ విద్యా సంస్థల నుండి టెన్త్ పేపర్లు లీకైన ఘటనలో అరెస్టైన గిరిధర్ రెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు నారాయణను అరెస్ట్ చేశారు.