రైతులకు యేటా రూ.20 వేలు, మహిళలకు ప్రతి నెలా రూ.1500, నిరుద్యోగులకు రూ. 3 వేలు : టీడీపీ మేనిఫెస్టో ఇదే

By Siva KodatiFirst Published May 28, 2023, 8:22 PM IST
Highlights

2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ‘‘ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ’’ మేనిఫెస్టోను విడుదల చేశారు. 

భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు చంద్రబాబు . యువత, మహిళలు, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు ఎలా తేవాలా అని తాము ఆలోచిస్తామన్నారు. సమర్ధులకు, చదువుకున్న వారికే టికెట్లు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వారిది ధనబలమని.. మనది ప్రజాబలమన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు. 

టీడీపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు :

  • మహిళల కోసం మహాశక్తి
  • యువత కోసం యువగళం
  • రైతుల కోసం అన్నదాత 
  • ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లోకి
  • 18 నుంచి 59 ఏళ్లు వున్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పథకం.
  • తల్లికి వందనం కింద ప్రత బిడ్డ తల్లీకి ఏటా రూ.15 వేలు
  • స్ధానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
  • ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు
  • జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు
  • అన్నదాత కార్యక్రమం కింద రైతులకు ఏటా రూ.20 వేలు
  • ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • పూర్ టు రిచ్ పేరుతో పేదల కోసం ప్రత్యేక పథకం
click me!